Chhaava Collection (2)
Chhaava Collection: ఈ ఏడాది ఆరంభంలోనే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మక చిత్రాలు విడుదలై బాక్స్ ఆఫీస్ వసూళ్ల విషయంలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘చావా'(Chhaava Movie). విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక మందన(Rashmika Mandana) హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని తెరకెక్కించినది అనే విషయం అందరికీ తెలిసిందే. నేడు ఈ సినిమా తెలుగు వెర్షన్ లో కూడా విడుదలైంది. ఇక్కడ ఎంత వసూళ్లు రాబడుతాయో ఇప్పుడే అంచనా వేయలేం కానీ, కచ్చితంగా డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ ని రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి ఇప్పటి వరకు బుక్ మై షో యాప్ నుండి కోటి టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. గడిచిన మూడు నెలల్లో పుష్ప 2 తర్వాత మరో కోటి కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమా రావడమంటే సాధారణమైన విషయం కాదు.
మూడు వారాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రీ సేల్స్ లో 7 లక్షల 76 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, మొదటి వారంలో 46 లక్షల టిక్కెట్లు, రెండవ వారంలో 35 లక్షల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా మూడు వారాలకు కలిపి 1 కోటి 3 లక్షల 94 వేల 140 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇది బాలీవుడ్ హిస్టరీ లోనే ఈమధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో ఆల్ టైం రికార్డు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక వసూళ్ల విషయానికి వస్తే మొదటి వారం లో ఈ సినిమాకి 225 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాగా, రెండవ వారంలో 186 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా మూడవ వారం లో 85 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవరాల్ గా మూడు వారాలకు కలిపి 496 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి. తెలుగు నేడు గ్రాండ్ గా విడుదల అవ్వగా, ఇక్కడి ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షో యాప్ లో గంటకు మూడు వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. కచ్చితంగా ఈ చిత్రం వీకెండ్ కి 20 కోట్ల గ్రాస్ మార్కుని కేవలం తెలుగు వెర్షన్ నుండి అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఫుల్ రన్ లో తెలుగు+ హిందీ వెర్షన్స్ కి కలిపి ఈ సినిమా 600 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వచ్చే వారం కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడితే, కచ్చితంగా ఈ సినిమా ఇంకా ఎక్కువ వసూళ్లను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read: నితిన్ బాత్ రూమ్ లో దూరిన దర్శకుడు, చివరికి బెడ్ రూమ్ లోకి కూడా… ఇదంతా దాని కోసమే!