https://oktelugu.com/

2021 : వివాదాల్లో నలిగిపోయిన స్టార్లు వీళ్ళే !

Celebrities: చూస్తుండగానే అప్పుడే ఈ ఏడాది పూర్తవ్వబోతుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరిస్థితి ఎప్పటిలాగే ఒకటి రెండు మెరుపులు ఉన్నా ఓవరాల్ గా మిశ్రమ ఫలితమే అందుకుంది. కానీ, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ వుడ్ లకు సంబంధించిన కొందరు హీరో హీరోయిన్లకు ఈ ఏడాది సక్సెస్ దక్కింది. సరే సక్సెస్ దక్కిన వాళ్ళ సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది కొందరు సినీ ప్రముఖులు వివాదాల్లో నిలిచి వార్తల్లో బ్రేకింగ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 21, 2021 / 05:14 PM IST
    Follow us on

    Celebrities: చూస్తుండగానే అప్పుడే ఈ ఏడాది పూర్తవ్వబోతుంది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా పరిస్థితి ఎప్పటిలాగే ఒకటి రెండు మెరుపులు ఉన్నా ఓవరాల్ గా మిశ్రమ ఫలితమే అందుకుంది. కానీ, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నీ వుడ్ లకు సంబంధించిన కొందరు హీరో హీరోయిన్లకు ఈ ఏడాది సక్సెస్ దక్కింది. సరే సక్సెస్ దక్కిన వాళ్ళ సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది కొందరు సినీ ప్రముఖులు వివాదాల్లో నిలిచి వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ అయ్యారు.

    Celebrities

    పైగా నటించిన సినిమాల కంటే వివాదాల ద్వారానే కొంతమంది ఫేమస్ అవ్వడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కి వివాదాలతో నలిగిపోయాడు. ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకుంటూ ‘ఆర్య‌న్ ఖాన్‌’ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ డ్రగ్స్‌ కేసులో ఆర్య‌న్ ఖాన్‌ ను ఎన్‌సీబీ అధికారులు విచారించగా సంచలన నిజాలు బయట పడ్డాయి. ఆర్యన్‌ గత నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు అధికారులకు చెప్పాడు.

    ఇక అశ్లీల చిత్రాల సృష్టికర్తగా పేరుప్రఖ్యాతలు సాధించిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా అరెస్ట్‌ కావడం, ఆ తర్వాత ఆయనగారి లీలల పై అనేక కథనాల రావడం గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకునే పనే లేదు. మొత్తమ్మీద అతగాడి కారణంగా శిల్పాశెట్టి వివాదాలకు కేంద్ర బిందువు అయింది. చివరకు శిల్పా శెట్టి బాలీవుడ్ లో నమ్మకాన్ని కోల్పోయింది. తనకు సంబంధం లేక‌పోయినా శిల్ప త‌ల వంచుకోవాల్సిన స్థితిలోకి వెళ్లిపోయింది.

    అన్నట్లు వందల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు చేసి మొత్తానికి ఈడీ కేసుల‌తో సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ అడ్డంగా బుక్ అయ్యాడు. అయితే ఈ కేసు ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మెడకు చుట్టుకుంది. డేటింగ్ సమయంలో జాక్వెలిన్ కి సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ చాలా కాస్ట్లీ బ‌హుమ‌తులు ఇచ్చాడు.

    Also Read: Pushpa Collections: ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ అయింది !

    హీరోయిన్ లందు కంగనా రనౌత్ వేరయా అన్నట్టు ఉంటుంది ఆమె వ్యవహార శైలి. ఆమె వివాదాల మహారాణి. నిత్యం ట్రోలింగ్ అవుతున్నా ఏమి పట్టించుకోదు. ఇక కేసులు పెట్టినా.. ఆమె ఇంటి ముందు గొడవలకు దిగినా అసలు వెనక్కి తగ్గదు. అయితే, పర్హాన్ అక్తర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి ఈ బ్యూటీ ఎప్పటిలాగే వార్తల్లో నిలిచింది. కాకపోతే.. ఈ కేసులో కోర్టు కంగనాకు అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది.

    స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా వివాదంలో నిలవాల్సి వచ్చింది. పనామా పేపర్స్ కేసులో తాజాగా ఆమె ఈడీ విచారణకు హాజరయింది.

    Also Read: Shyam Singha Roy: ‘శ్యామ్​ సింగరాయ్’​లో కిస్ సీన్​పై యాంకర్​ డౌట్​.. స్ట్రాంగ్​ కౌంటర్ ఇచ్చిన సాయిపల్లవి

    Tags