https://oktelugu.com/

Tamannah: ఎంతమంది బ్యూటీలున్నా.. ఈ మిల్కీ బ్యూటీ చాలా స్పెషల్​

Tamannah: తెలుగు ప్రేక్షకుల్లో తన అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానం దక్కించుకుంది మిల్కీ బ్యూటీ తమన్న. బాలీవుడ్​ సినిమాతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తెలుగు ఇండస్ట్రీలో భారీ క్రేజ్​  తెచ్చుకుంది. తమిళ్​ సినిమాల్లోనూ నటించి.. అన్ని ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్​ ఫాలోయింగ్​ను క్రియేట్​ చేసుకుంది. ఈ రోజు మిల్కీ బ్యూటీ తమన్న పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్​పై ఓ లుక్​ వేద్దాం. Also Read: […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 21, 2021 / 05:13 PM IST
    Follow us on

    Tamannah: తెలుగు ప్రేక్షకుల్లో తన అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రత్యేక స్థానం దక్కించుకుంది మిల్కీ బ్యూటీ తమన్న. బాలీవుడ్​ సినిమాతో సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తెలుగు ఇండస్ట్రీలో భారీ క్రేజ్​  తెచ్చుకుంది. తమిళ్​ సినిమాల్లోనూ నటించి.. అన్ని ప్రాంతాల్లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్​ ఫాలోయింగ్​ను క్రియేట్​ చేసుకుంది. ఈ రోజు మిల్కీ బ్యూటీ తమన్న పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆమె సినీ కెరీర్​పై ఓ లుక్​ వేద్దాం.

    Tamannah

    Also Read: మళయాళ నటికి ఆకతాయి వేధింపులకు కారణాలేంటి?

    2005లో బాలీవుడ్​ చాంద్​ సా హోషన్ చెహ్రా సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టింది తమన్న.  అయితే, అక్కడ పెద్దగా కలిసిరాకపోవడంతో టాలీవుడ్​ వైపు మల్లింది. శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి.. ఆ తర్వాత తమిళంలో కేడీ సినిమాతో హాయ్ చెప్పింది. ఇప్పటికి ఫిల్మ్ ఇండస్ట్రీలో తమన్న ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్​ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్​లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్​గా నిలబడాలంటే చాలా కష్టం అలాంటిది గత 15 ఏళ్లుగా ఒకటే క్రేజ్​ను మెయిన్​టేన్ చేస్తూ.. స్టార్ హీరోయిన్లలో ఒకరిగా హవా సాగిస్తోంది ఈ బ్యూటీ.

    ప్రస్తుతం పలు చిత్రాల్లో ఫుల్​ బిజీగా ఉంది తమన్న. ఇటీవలే గోపిచంద్​ సినిమా సీటీమార్​ సినిమాతో హిట్ కొట్టిన ఈ భామ.. అనిల్​ రావిపుడి దర్శకత్వంలో రానున్న ఎఫ్​3లో నటిస్తోంది. ఇందులో వెంకటేశ్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మరోవైపు సోషల్​మీడియాలోనూ యాక్టీవ్​గా ఉంటూ.. అభిమానులను ఎప్పటికప్పుడు పోస్ట్​లతో పలకరిస్తుంటుంది.

    Also Read: వివాదాల్లో నలిగిపోయిన స్టార్లు వీళ్ళే !