అధికార పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బర్త్ డే మరీ.. పోలీసుల స్వామిభక్తి చల్లగుండా!

ఆయన సీఎం కాదు.. పోనీ మంత్రి కూడా కాదు.. కేవలం అధికార వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక సాధారణ ఎమ్మెల్యే.. అయితేనేమీ అధికార పార్టీ కదా.. అందుకే పోలీసులు స్వామిభక్తి చాటుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించి నానా హంగామా చేశారు. గజమాలతో సత్కరించి దాసోహమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో పోలీసుల హంగామా చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఓ భారీ […]

Written By: NARESH, Updated On : December 21, 2021 5:24 pm
Follow us on

ఆయన సీఎం కాదు.. పోనీ మంత్రి కూడా కాదు.. కేవలం అధికార వైసీపీలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక సాధారణ ఎమ్మెల్యే.. అయితేనేమీ అధికార పార్టీ కదా.. అందుకే పోలీసులు స్వామిభక్తి చాటుకున్నారు. ఏకంగా ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించి నానా హంగామా చేశారు. గజమాలతో సత్కరించి దాసోహమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

proddatur-mla-siva-prasad-reddy

కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల్లో పోలీసుల హంగామా చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఓ భారీ కేక్ కట్ చేయించి పోలీసులు చూపిన చొరవ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ, ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. ఈయన బర్త్ డేను ఊరంతా పండుగలా చేసింది ఎవరో కాదు ఆ నియోజకవర్గంలోని సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు.. ఇప్పుడు ఇదే వైరల్ అయ్యింది.

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పోలీసుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశమైంది. యూనిఫామ్ లో వెళ్లి మరీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు పోలీసులు.

ప్రొద్దుటూరు రూరల్ సీఐ మధుసూదన్ గౌడ్, ఎస్సైలు శివశంకర్, సంజీవరెడ్డి, రాజుపాలెం ఎస్సై క్రుష్ణంరాజు కలిసి ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం దుమారం రేపుతోంది. స్వయానా ఎమ్మెల్యే ఇంట్లో కానిస్టేబుళ్లను సైతం తీసుకెళ్లి రాచమల్లును గజమాలతో సత్కరించి ఆయనతో భారీ కేక్ కట్ చేయించడం చూసి అంతా అవాక్కయ్యారు.

బాధ్యతగల పోలీసులు.. ప్రభుత్వ అధికారులుగా ప్రజా సేవకులుగా ఉండాల్సిన వీరు ఎమ్మెల్యే సేవకులుగా మారారని పలువురు ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు వారి విమర్శలకు ఊతం ఇచ్చినట్టైంది. పోలీసులు యూనిఫామ్ లో ఉండి ఎమ్మెల్యే ఇంటికెళ్లి వేడుకలు చేయడాన్ని టీడీపీ నేతలు విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తాము ప్రభుత్వ అధికారులమనే విషయాన్ని మరిచిపోయారా? అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పోలీసులపై డీజీపీ వెంటనే చర్య తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.