Celebritie Couples: సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అయితే ఇలా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటున్న సమయంలో వారు ఆ ప్రేమ ద్వారా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టి ఎంతో సంతోషంగా గడుపుతారు. మరికొందరు మాత్రం వారి ప్రేమ విఫలమై అంతటితో ఆగిపోతారు. అయితే ఇలాంటి ప్రేమలు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీల విషయంలో ఎక్కువ జరుగుతుంటాయి.
Also Read: Radhe Shyam: పుకార్లకు రాధేశ్యామ్ చెక్.. ప్రభాస్ టీమ్ కొత్త ప్లాన్ !
ఒక సినిమాను తెరకెక్కించాలని అంటే కొన్ని నెలల సమయం పాటు రాత్రి పగలు ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్లు కలిసి పనిచేయడం వల్ల వారి మధ్య ప్రేమ పుట్టడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది దర్శకులు హీరోయిన్ల ప్రేమలో పడిన వారు ఉన్నారు.ఇలా హీరోయిన్స్ ప్రేమించి చివరికి వారిని పెళ్లి చేసుకున్న దర్శకులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని చెప్పవచ్చు. మరి ఇలా అలా దర్శకుల ప్రేమలో పడి వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం…
#1) లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నటి సుహాసిని పెళ్లి చేసుకున్నారు.
#2)అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఖుష్బూ డైరెక్టర్ సుందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
#3) హీరోయిన్ రాశి దర్శకుడు నివాస్ ను పెళ్లి చేసుకున్నారు.
#4) అదేవిధంగా హీరోయిన్ రోజా తమిళ దర్శకుడు ఆర్.కె.సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
#5) అదేవిధంగా తమిళ నటి శరణ్య, డైరెక్టర్ పొన్నవన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
#6) అదేవిధంగా డైరెక్టర్ కృష్ణవంశీ రమ్యకృష్ణ పెళ్లి చేసుకున్నారు.
వీరితో పాటు యంగ్ హీరోయిన్ అమలా పాల్ దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుని కొన్ని రోజులకు విడాకులు తీసుకొని విడిపోయారు.
#7) ఇకపోతే డైరెక్టర్ విగ్నేష్ శివన్ కూడా హీరోయిన్ నయనతారతో ప్రేమలో ఉన్నారు. త్వరలోనే వీరి కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
వీరితో పాటు యంగ్ హీరోయిన్ అమలా పాల్ దర్శకుడు ఏఎల్ విజయ్ ను పెళ్లి చేసుకుని కొన్ని రోజులకు విడాకులు తీసుకొని విడిపోయారు.
Also Read: Mega Power Star Ram Charan: మరో క్రేజీ అప్ డేట్.. కొరటాల సినిమాలో చరణ్ ?