Huzurabad and Badvel: హుజూరాబాద్, బద్వేలులో ప్రారంభమైన పోలింగ్.. ప్రశాంతంగా ఎన్నికలు

Huzurabad and Badvel: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. హుజురాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. 106 గ్రామపంచాయతీల్లోని 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 1715 మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 2,36,283 మంది ఓటర్లుండగా ఇందులో పురుషులు 1,18,720, మహిళలు 1,17,563 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల బరిలో 30 మంది అభ్యర్థులున్నారు. 3865 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
Huzurabad and Badvel
కడప జిల్లాలోని బద్వేల్ ఉప ఎన్నికకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 15 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా 221 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. 3 వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో 2,16,139 ఓటర్లున్నారు. అందులో 1,07,340 మంది మహిళా ఓటర్లు, 1,08,799 మంది పురుష ఓటర్లున్నారు. 917 పోస్టల్ బ్యాలెట్ ఓట్లున్నాయి.

ఓటు వేయడానివచ్చే ఓటర్లు నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని చెబుతున్నారు. భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించారు. ఓటు వేసేందుకు వచ్చే వారు విధిగా ఓటరు స్లిప్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని చెబుతున్నారు.

Also Read: Modi PM: బీజేపీ సంచలన ప్రకటన : 2024లోనూ మోడీనే ప్రధాని.. వర్కవుట్ అవుతుందా?

పోలింగ్ సరళిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడ కూడా ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలగకుండా అధికారులు ఫోకస్ పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: Crime News: మిస్ తెలంగాణ.. రెండోసారి సూసైడ్.. కారణమిదే

Get notified whenever we post something new!

Continue reading

Healthy Lifestyle Tips: 18 ఏళ్లు నిండిన వారిలో ఈ సమస్యలు.. ఎందుకో తెలుసా?

Healthy Lifestyle Tips: ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే ఈ వయసులో ఉన్న వారి ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి తగ్గుతుంది. రక్త ప్రసరణ కూడా నెమ్మదిస్తుంది. అంతేకాకుండా ఈ వయసులో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన గుండెపోటు...

Emotional Rakhi Story: 40 ఏళ్ల తర్వాత రాఖీ కట్టిన సోదరి.. ఎందుకో తెలుసా?

Emotional Rakhi Story: దేశవ్యాప్తంగా రాఖి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీమణులు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఇందుకు ప్రత్యేకగా సోదరులు తమ చెల్లెళ్లకు విలువైన బహుమతులను అందించారు. కొందరు చెల్లెళ్ళు ప్రతి ఏటా రాఖీని కడుతూ సోదరులపై మమకారాన్ని చూపిస్తున్నారు. కానీ...

Loan Management Tips: మనదేశంలో ఎన్ని కోట్ల మంది లోన్లు తీసుకుంటున్నారో తెలుసా?

Loan Management Tips: మనిషి అవసరానికి డబ్బు చాలా అవసరం. అయితే అందరి వద్ద అనుకున్నంత ఆదాయం ఉండదు. కానీ నేటి కాలంలో ఆదాయానికి మించిన అవసరాలు, ఖర్చులు ఏర్పడుతున్నాయి. దీంతో అదనపు ఆదాయం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ అప్పులు బ్యాంకు లోన్ తీసుకునే అంతవరకు ఉంటున్నాయి. కొందరు ఇంట్లో అవసరాల...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version