Hari Hara Veera Mallu: ఎన్నో అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు ఈ నెల 24 న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గానే విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే చర్చ. ఎందుకంటే సౌత్ లోనే ఆల్ టైం రికార్డు వ్యూస్ ని సొంతం చేసుకుంది కాబట్టి. ఇప్పటికీ యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. సినిమా మీద హైప్ ఒక్కసారిగా పదింతలు ఎక్కువ అయ్యింది. ఈ చిత్రం నుండి అభిమానులు ఎలాంటి కంటెంట్ ని అయితే కోరుకున్నారో, అంతకు మించిన కంటెంట్ వచ్చేసింది. ఇక మూవీ టీం ఫైనల్ కాపీ ని సిద్ధం చేసే పనిలో పడింది. ఈ నెల 11 న సెన్సార్ కార్యక్రమాలు కూడా జరగొచ్చు. అయితే ఈ చిత్రం ఇప్పుడు మరో కొత్త వివాదం లో చిక్కుకునే అవకాశం ఉంది.
Also Read: గిల్ శతకాల మోత, ఆకాష్, సిరాజ్ వికెట్ల వేట.. రెండో టెస్టులో టీమిండియా విజయానికి కారణాలివే!
తెలంగాణ పోరాట యోధుడు ‘పండుగ సాయి’ అభిమానులు ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని అడ్డుకుంటాము అంటూ హెచ్చరికలు జారీ చేస్తూ, త్వరలోనే హై కోర్టు లో కేసు వేస్తాము అంటూ చెప్పుకొచ్చారు. కారణం ఏమిటంటే ఇప్పటి వరకు విడుదలైన హరి హర వీరమల్లు కంటెంట్ ని చూస్తుంటే మా ‘పండుగ సాయి’ గారి చరిత్ర ని ఎలా పడితే అలా తీసినట్టుగా అనిపిస్తుంది. దీనిని మేము అసలు సహించము అంటూ చెప్పుకొచ్చారు. యూట్యూబ్ లో కూడా అనేక కథనాలు వచ్చాయి, ఇది పండుగసాయి అన్న చరిత్ర అని. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి ఈ విషయం పై చర్చిస్తాము. హరి హర వీరమల్లు కంటెంట్ ని ఎట్టిపరిస్థితిలో మార్చాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
నిర్మాత AM రత్నం ఇది పక్కా ఫిక్షనల్ స్టోరీ అని, ఎవరిని ఆదర్శంగా తీసుకోలేదని స్పష్టంగా చెప్పుకొచ్చాడు. రేపు ఒకవేళ హై కోర్టులో కేసు వేసిన వెంటనే కొట్టివేస్తారని, అసలు నిలవదని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఈ సినిమా గురించి రచ్చ చేయండి, టీవీ న్యూస్ చానెల్స్ లో కూర్చొని డిబేట్స్ చేయండి అని అంటున్నారు. ఎందుకంటే సినిమాకు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని, ఎలాగో మా నిర్మాత సరిగా ప్రొమోషన్స్ చేయడం లేదని సెటైర్స్ వేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 19 న తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ ఈవెంట్ జరిగే రెండు రోజుల ముందు, అనగా జులై 17 న వారణాసి లో మరో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
#HHVM పై హై కోర్ట్ లో పిల్ వేస్తున్నాం..
సినిమా కంటెంట్ మార్చకపోతే అడ్డుకుంటాం..
పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాం.. ఆయనతో మాకు గొడవ లేదు.. #HariHaraVeeraMallu pic.twitter.com/TeoTm1Kkxu
— M9 NEWS (@M9News_) July 6, 2025