War 2 Movie Benefit Shows: సమ్మర్ లో రావాల్సిన పెద్ద హీరోల సినిమాలు రాలేదు. ఇండస్ట్రీ మొత్తం బోసిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం నాన్ స్టాప్ గా పెద్ద సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి. అందులో ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన్న హిందీ చిత్రం ‘వార్ 2′(War 2 Movie) ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్నటువంటి విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ చిత్రం 80 కోట్ల రూపాయలకు తెలుగు వెర్షన్ అమ్ముడుపోయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని కొనుగోలు చేశాడు. దేవర చిత్రం తర్వాత ఆయన తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సినిమా ఇదే. నాగవంశీ ఒక సినిమాని డీల్ చేసాడంటే ప్లానింగ్ అభిమానుల ఊహకు అందని రేంజ్ లో ఉంటుంది.
Also Read: గిల్ శతకాల మోత, ఆకాష్, సిరాజ్ వికెట్ల వేట.. రెండో టెస్టులో టీమిండియా విజయానికి కారణాలివే!
సినిమా విడుదలకు ఇంకా 40 రోజులకు పైగా సమయం ఉంది. కానీ ఇప్పటి నుండే థియేటర్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 500 కి పైగా బెనిఫిట్ షోస్ ని ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ నిన్న అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కి అత్యధికంగా బెనిఫిట్ షోస్ ద్వారానే కలెక్షన్స్ వస్తుంటాయి. ఆయన బెనిఫిట్ షోస్ కి వచ్చేంత గ్రాస్ కొంతమంది స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా రాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. లీడ్ రోల్ చేసిన సినిమాకు బెనిఫిట్ షోస్ డిమాండ్ ఉండడం సహజం,కానీ ఒక క్యారక్టర్ రోల్ చేసిన సినిమా, అది కూడా నెగెటివ్ రోల్ లో కనిపించబోయే సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం చూస్తుంటే ఎన్టీఆర్ కి ప్రస్తుతం మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది అర్థం అవుతుంది.
ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేవాళ్ళు కాదు. కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే ఆయన పరిమితంగా ఉండేవాడు. కానీ టెంపర్ నుండి ఎన్టీఆర్ తనను తానూ మార్చుకున్న తీరు అద్భుతం అనే చెప్పాలి. ఎన్టీఆర్ సినిమా అంటే కచ్చితంగా అందులో మినిమం గ్యారంటీ కంటెంట్ ఉంటుంది అనే రేంజ్ బ్రాండ్ ని సంపాదించుకున్నాడు. అందుకే ‘దేవర’ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినా అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘వార్ 2’ తో కూడా తెలుగు లో ఆయన అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో లేదో చూడాలి. రీసెంట్ గా ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని షాట్స్ లో ఎన్టీఆర్ హాలీవుడ్ హీరో రేంజ్ లుక్స్ తో ఉన్నాడని అంటున్నారు ఫ్యాన్స్.