https://oktelugu.com/

మున్ముందు ఓటీటీ సినిమాలంటే భయపడాలేమో..

కరోనా కారణంగా ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. వీకెండ్‌ వచ్చినా బయటికి పోలేకున్నాం. అటు ఎంటర్‌‌టైన్మెంట్‌ కూడా మిస్ అయ్యాం. కరోనా నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఒక్కొక్కటిగా అన్‌లాక్‌ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఏడు నెలలుగా మూసి ఉన్న థియేటర్లు కూడా ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. ఇన్నాళ్లు ఎంటర్‌‌టైన్‌మెంట్‌ కోల్పోయామని ఫీలైన వారికి ఇది శుభవార్తలాంటిదే. Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 11:14 AM IST
    Follow us on


    కరోనా కారణంగా ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. వీకెండ్‌ వచ్చినా బయటికి పోలేకున్నాం. అటు ఎంటర్‌‌టైన్మెంట్‌ కూడా మిస్ అయ్యాం. కరోనా నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఒక్కొక్కటిగా అన్‌లాక్‌ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఏడు నెలలుగా మూసి ఉన్న థియేటర్లు కూడా ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. ఇన్నాళ్లు ఎంటర్‌‌టైన్‌మెంట్‌ కోల్పోయామని ఫీలైన వారికి ఇది శుభవార్తలాంటిదే.

    Also Read: క్వారంటైన్లోకి వెళ్లనున్న రాంచరణ్, ఎన్టీఆర్..! నెలఖారు నుంచి ‘ఆర్ఆర్ఆర్’

    అయితే.. థియేటర్లతో పనిలేకుండా కొంత మంది ఈ లాక్‌డౌన్‌లోనూ కొత్త కొత్త సినిమాలను వీక్షించారు. ఓటీటీ రూపంలో వారికి ఆ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ లభించింది. డిజిటల్‌ ప్లాట్‌ఫాం వేదికగా కొత్త దారులు వెతికారు. అమెజాన్‌ ప్రైమ్, ఆహా లాంటి ఓటీటీ సంస్థలు పలు సినిమాలను కొనుగోలు చేసి విడుదల చేస్తున్నాయి. అయితే ఈ సీజన్లో ఓటీటీల ద్వారా విడుదలైన ఏ సినిమాకు సరైన రెస్పాన్స్ రాకపోవడం షాకింగ్‌కు గురిచేస్తోంది. గత నెలలో విడుదలైన నాని ‘వి’ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా విడుదలైన ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్దం సినిమాలకు కూడా అదే టాక్ వచ్చింది.

    థియేటర్లు, మల్టీ‌ప్లెక్స్‌లు ఇంకా తెరుచుకోకపోవడంతో వినోదాన్ని ఆశిస్తున్న ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన సినిమాలు మరింత సహనానికి గురి చేస్తున్నాయి. దీంతో ఓటీటీ సినిమాలంటేనే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. థియేటర్లలో రిలీజ్ చేస్తే కచ్చితంగా ఫ్లాప్‌  అవుతాయన్న సినిమాలను ఓటీటీలకు అమ్మేసి నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ అందించాలన్న ఉత్సాహంతో ఓటీటీ సంస్థలు అడ్డగోలుగా సినిమాలను కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నాయని అంటున్నారు.

    Also Read: ‘మెసగాళ్లు’ టీజర్ టాక్: ఇది సరిపోతుందిగా?

    ఈ పరిస్థితి వల్లే ఓటీటీల్లో సరైన సినిమాలు రావడం లేదన్న ఆరోపణ ఉంది. భవిష్యత్తులోనూ ఇలాంటి కంటెంటే గనుక ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఓటీటీలపై నమ్మకం పోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రేక్షకులకు అందించే కంటెంట్‌పై ఓటీటీ సంస్థలు పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.