దర్శకదిగ్గజం రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ నిత్యం ఏదో ఒక అప్డేట్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటోంది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
Also Read: మున్ముందు ఓటీటీ సినిమాలంటే భయపడాలేమో..
‘ఆర్ఆర్ఆర్’లో మెగా పవర్ స్టార్ రాంచరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అల్లూరి సీతరామరాజుగా రాంచరణ్.. కొమురంభీంగా ఎన్టీఆర్ కన్పించబోతున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగు జరుపుకుంటున్న సమయంలో కరోనాతో సినిమా వాయిదా పడింది. ఈ మూవీ షూటింగు ప్రారంభిస్తారని అనుకున్న సమయానికి దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కరోనా బారిన పడ్డారు.
దీంతో ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఇటీవల వీరంతా కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ఈనెలాఖరు వరకు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈమేరకు ‘ఆర్ఆర్ఆర్’ టీం 14రోజులపాటు క్వారంటైన్లోకి వెళ్లనుంది. ఈనెల 10నుంచే సినిమా నటులందరూ ఓ హోటలోని ప్రత్యేక గదుల్లో క్వారంటైన్లో ఉంటారని తెలుస్తోంది. ఇందులో రాంచరణ్, ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని సమాచారం.
Also Read: ‘మెసగాళ్లు’ టీజర్ టాక్: ఇది సరిపోతుందిగా?
‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ చేసే ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజేషన్ చేయించడం.. థర్మల్ స్ర్కీనింగ్ ద్వారా నటీనటుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట. నటీనటుల క్వారంటైన్ పీరియడ్ పూర్తయ్యాకే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుత షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్.. రాంచరణ్ పాల్గొననున్నారని టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ ఈసారైనా అనుకున్న సమయానికి ప్రారంభం అవుతుందో లేదో చూడాలి..!