https://oktelugu.com/

Star Hero: కేవలం 10 నిమిషాల సీన్ కోసం రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న ఒకే ఒక తెలుగు స్టార్ హీరో ఎవరో ఊహించగలరా…

Star Hero: లేటెస్ట్ గా రిలీజ్ అయినా ఒక సినిమాలో గెస్ట్ రోల్ కోసం ఒక స్టార్ హీరో ఏకంగా రూ.100 కోట్లు పారితోషకం అందుకున్నట్లు సమాచారం.గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్,జవాన్,డంకి వంటి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : July 8, 2024 1:49 pm
    Can you guess who is the only Telugu star hero who took a remuneration of Rs.100 crores for just 10 minutes scene

    Can you guess who is the only Telugu star hero who took a remuneration of Rs.100 crores for just 10 minutes scene

    Follow us on

    Star Hero: సినిమా ఇండస్ట్రీ ఏదైనా కూడా కొంత మంది స్టార్ హీరోలు కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించి అలరించారు.సెలెబ్రెటీలు కోట్లలో పారితోషకం అందుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయిపొయింది.గెస్ట్ రోల్ లో అయినా సరే ఫలానా హీరో అయితేనే ఆ రోల్ కు న్యాయం చేయగలడు అని అనిపిస్తే నిర్మాతలు కోట్లలో పారితోషకం ఇవ్వడానికి కూడా రెడీ గా ఉన్నారు.

    ఈ క్రమంలోనే లేటెస్ట్ గా రిలీజ్ అయినా ఒక సినిమాలో గెస్ట్ రోల్ కోసం ఒక స్టార్ హీరో ఏకంగా రూ.100 కోట్లు పారితోషకం అందుకున్నట్లు సమాచారం.గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పఠాన్,జవాన్,డంకి వంటి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు.షారుఖ్ నటించిన పఠాన్ రూ.1050 కోట్లు,జవాన్ రూ.1100 కోట్లు,డంకి రూ.470 కోట్ల వసూళ్లు రాబట్టింది.

    ఇక సూపర్ స్టార్ నటించిన జైలర్ సినిమా కూడా గత ఏడాది రూ.650 కోట్లు వసూళ్లు రాబట్టింది.జైలర్ సినిమాతో రజనీకాంత్ రూ.250 కోట్లు పారితోషకం అందుకున్నారు.రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయినా కల్కి సినిమా ఇప్పటికే రూ.800 కోట్లు రాబట్టి రూ.1000 కోట్లు దిశగా పరుగులు పెడుతుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి AD 2898 సినిమాలో కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కీన్ పాత్రలో కనిపించారు.ఈ పాత్రలో కమల్ హాసన్ ను తప్ప ప్రేక్షకులు మరొకరిని ఉహించుకోలేరు అన్నంత అద్భుతంగా నటించారు.

    ఈ సినిమాలో సుప్రీమ్ పాత్రలో కమల్ హాసన్ 10 నిమిషాల కంటే తక్కువగానే కనిపిస్తారు.కల్కి సినిమాలో 10 నిమిషాల క్యామియో రోల్ లో కనిపించటానికి కమల్ హాసన్ ఏకంగా రూ.100 కోట్లు పారితోషకం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మరోపక్క కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.