https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో తెలుసా..?

1996వ సంవత్సరంలో కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఒక క్లాసికల్ హిట్ సినిమా నిలిచిపోయిందనే చెప్పాలి. అలాంటి ఒక భారతీయుడు సినిమాకి 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ని తీశారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుదో చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 01:26 PM IST

    Bharateeyudu 2

    Follow us on

    Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా ఒకప్పుడు చాలా వైవిధ్యమైన చిత్రాలైతే వచ్చాయి. వాటిలో చాలా సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. దాంతో పాటుగా ఆయనకు ‘లోకనాయకుడు’ అనే ఒక బిరుదు కూడా సంపాదించి పెట్టాయి. ఇక ఇలాంటి క్రమంలో తమిళంలో ఆయనకు ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉందో తెలుగులో కూడా అంతే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు.

    ఇక 1996వ సంవత్సరంలో కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. అలాగే ఒక క్లాసికల్ హిట్ సినిమా నిలిచిపోయిందనే చెప్పాలి. అలాంటి ఒక భారతీయుడు సినిమాకి 28 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సీక్వెల్ ని తీశారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుదో చూడాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయించినట్టుగా తెలుస్తుంది.

    మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 300 కోట్లకు పైన వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తెలుగులో ఈ సినిమాను 25 కోట్లకు అమ్మేసారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 26 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. నిజానికి శంకర్ కి తెలుగులో ఉన్న మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ రేట్ కి రైట్స్ అమ్ముడుపోయాయనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ అయితే మరొకసారి శంకర్ పాన్ ఇండియాలో తన సత్తాని చాటుతాడు.

    ప్లాప్ అయితే మాత్రం శంకర్ ఖాతాలో మరో ప్లాప్ చేరుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులందరూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. కాబట్టి శంకర్ కూడా ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఆయనకి భారీ సక్సెస్ ను ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…