Kerintha Fame Bhavana: అస్సలు గుర్తించలేనంతగా మారిపోయిన కేరింత సినిమాలో భావన…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా…

Kerintha Fame Bhavana: దిల్ రాజు స్టార్ హీరో లతో పాటు కొత్త వాళ్లతో కూడా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.అలా తీసిన సినిమాలలో 2015 లో రిలీజ్ అయినా కేరింత సినిమా మంచి హిట్ గా నిలిచింది.సుమంత్ అశ్విన్,శ్రీ దివ్య హీరో హీరోయిన్ లుగా నటించిన...

Written By: Neelambaram, Updated On : July 8, 2024 1:58 pm

Kerintha Movie Fame Bhavana alias Sukrithi Ambati

Follow us on

Kerintha Fame Bhavana: ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.నితిన్ హీరో గా నటించిన దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దిల్ రాజు.ఆ తర్వాత ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఉన్నారు.

దిల్ రాజు స్టార్ హీరో లతో పాటు కొత్త వాళ్లతో కూడా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.అలా తీసిన సినిమాలలో 2015 లో రిలీజ్ అయినా కేరింత సినిమా మంచి హిట్ గా నిలిచింది.సుమంత్ అశ్విన్,శ్రీ దివ్య హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాలో విశ్వనాథ్,తేజస్వి,పార్వతీశం,సుకృతి వంటి పలువురు నటించారు.సాయి కిరణ్ అడవి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సాయి కిరణ్ అడవి వినాయకుడు,విలేజ్ లో వినాయకుడి వంటి సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.కేరింత సినిమాను కాలేజీ,ఫ్రెండ్ షిప్,లవ్ స్టోరీ తో అందంగా తెరకెక్కించాడు సాయి కిరణ్.మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలన్ని హిట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో నూకరాజు కు పెయిర్ గా నటించిన భావన అందరికి గుర్తుండే ఉంటుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు చాల కొత్తగా,ఫన్నీ గా ఉంటాయి.ఈ సినిమాలో భావన పాత్రలో నటించిన అమ్మాయి సుకృతి అంబటి.తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సుకృతి.ఈ సినిమా తర్వాత ఈమె చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉంది.సుకృతి తండ్రిది నెల్లూరు జిల్లా కావలి అయినప్పటికీ ఉద్యోగ రీత్యా ఆయన చాల ఏళ్ళ నుంచి ఢిల్లీ లో స్థిరపడ్డారని తెలుస్తుంది.ఇటీవలే సుకృతి పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెట్టిందని సమాచారం.ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.