Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu- Rajamouli: రాజమౌళి సినిమాతో మహేష్ ప్యాన్ వరల్డ్ స్టార్ అవ్వగలడా?

Mahesh Babu- Rajamouli: రాజమౌళి సినిమాతో మహేష్ ప్యాన్ వరల్డ్ స్టార్ అవ్వగలడా?

Mahesh Babu- Rajamouli: రాజమౌళి సినిమా వస్తుంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లు ప్యాన్ వరల్డ్ స్టార్లుగా ఎదిగారంటే దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి. తెలుగు సినిమాల ఖ్యాతిని హద్దులు దాటించిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. మరి రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటి అని అందరూ ఆరా తీస్తున్న సమయంలో మహేష్, జక్కన్న కాంబోలో సినిమా రానుందనే వార్తతో ఫుల్ ఖుషీ అయ్యారు ఇద్దరి స్టార్ల అభిమానులు.

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా రాబోతుందని గత కొంత కాలంగా టాక్ వినిపిస్తున్నా..దీనికి సంబంధించిన అప్డేట్ లేదు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరంలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు మేకర్స్. పాన్ ఇండియా మూవీలా కాకుండా పాన్ వరల్డ్ మూవీలా జక్కన్న ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను రాజమౌళి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. రాజమౌళి సినిమాలు అంటే ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ ఈ సారి అలా కాకుండా ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ఫుల్ ఫోకస్ గా జక్కన్న సినిమాపైనే ఇంట్రెస్ట్ పెడుతారని టాక్. ఆ సినిమా షూటింగ్ ను 2024లోనే పూర్తి చేసి… 2025లో ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవాలని.. ఆ తర్వాత 2025లో సినిమాను విడుదల చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళి, మహేష్ కాంబోలో సినిమా.. ప్లానింగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ.. రాజమౌళి క్వాలిటీ విషయంలో రాజీపడడు. అలాగే ఏ సీన్ అయినా సరే.. తను అనుకున్న విధంగా వచ్చే వరకు కాంప్రమైజ్ కాడు. అందుచేత 2025లో సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ రీచ్ కావడం కాస్త కష్టమే. అయితే మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తారు అన్నట్టు.. సినిమాకు సమయం తీసుకున్నా.. హిట్ పక్కా ఉంటుంది అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలతో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ వరల్డ్ స్టార్లు అయ్యారు. దీంతో ఈ సారి మహేష్ కూడా పాన్ వరల్డ్ స్టార్ అని ముందే ఫిక్స్ అయ్యారు అభిమానులు.

పక్కా ప్లానింగ్, ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషన్స్, స్టోరీ ఇవ్వడంలో రాజమౌళికి తిరుగు ఉండదు. అలాంటప్పుడు సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. అంటే మహేష్, జక్కన్న కాంబోలో వచ్చే సినిమా కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. కాబట్టి మా మహేష్ కూడా పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడం పక్కా అంటూ ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version