Chiranjeevi: కూతురితో చిరు సినిమా ఇక లేనట్టే..?

మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో రాబోతోన్న చిత్రం మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. భోళా శంకర్ సినిమా తరువాత చిరంజీవి స్క్రిప్టుల ఎంపిక మీద అందరికీ అనుమానం కలిగింది.

Written By: Suresh, Updated On : September 12, 2023 2:49 pm

Chiranjeevi

Follow us on

Chiranjeevi: చిరంజీవి తన కూతురుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సుష్మిత గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్‌కు చిరు ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారట. కానీ ఇంత వరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. దీంతో ఈ సినిమా ఉంటుందా? లేదా?.. ఆలస్యం అవుతుందా? అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ వశిష్ట మూవీ మాత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేసింది. అంటే సుష్మిత బ్యానర్లో రావాల్సిన సినిమా మరింత ఆలస్యం అవుతుందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో రాబోతోన్న చిత్రం మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. భోళా శంకర్ సినిమా తరువాత చిరంజీవి స్క్రిప్టుల ఎంపిక మీద అందరికీ అనుమానం కలిగింది. దీంతో ఇలాంటి రీమేకులు చేయకండి బాసూ అంటూ అభిమానులు ధీనంగా ప్రాదేయపడ్డారు కూడా. దీనికి తగ్గట్టే చిరంజీవి సైతం ఇక నో రీమేక్ అని ఆదేశాలు పంపినట్టుగా సమాచారం వచ్చింది. చిరు బర్త్ డే సందర్భంగా వదిలిన అప్డేట్‌తో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

బింబిసారా సినిమాతో వశిష్ట టాలీవుడ్‌ను షేక్ చేశాడు. కళ్యాణ్ రామ్‌ను మళ్లీ నిలబెట్టిన చిత్రంగా బింబిసారా నిలిచింది. ఈ మూవీని వశిష్ట హ్యాండిల్ చేసిన తీరుకు అంతా ఫిదా అయ్యారు కూడా. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో వశిష్ట సినిమాలపై అంచనాలు పెరిగాయి.బింబిసారా 2 వస్తుందని.. కానీ అంతలోనే కళ్యాణ్ రామ్ కు వశిష్టకు మధ్య గొడవలు జరిగాయని కూడా టాక్ వచ్చింది. దీంతో బింబిసారా 2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. కానీ చిరు, వశిష్ట సినిమాపై అప్డేట్ వచ్చింది.

ప్రస్తుతం కూతురు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. కానీ ఒక సినిమా వస్తుందిగా అంటూ మరోవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ రీమేక్ సినిమాలకు పూర్తిగా పులిస్టాప్ పెడుతారా? లేదా హిట్ సినిమాలను ఎంచుకుంటారా? అసలు కూతురుతో సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే వేచి ఉండాల్సిందే.