Bunny Vox: సోషల్ మీడియా పుణ్యామాని చాలా మంది భామలు స్టార్లుగా మారిపోయారు. తమ టాలెంట్ ను పరీక్షించుకోవడానికి ఇది మంచి వేదికగా మారింది. ఇప్పుడు కొంతమంది సినిమాల్లో కొనసాగుతున్న స్టార్లు ఒకప్పుడు డిఫరెంట్ వీడియోలతో సోషల్ మీడియాలో ఆకట్టుకున్నవారే. అలా చేసి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను తెచ్చుకున్నారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు తెచ్చుకున్నారు. లేటేస్టుగా వర్షిణి వర్మ అనే తెలుగమ్మాయి తన వీడియోలతో ఫుల్ పాపులారిటీ సాధించింది. బన్నీ వోక్స్ పేరుతో ఆమె చేస్తున్న హంగామాకు యూత్ ఫిదా అవతున్నారు. అంతేకాకుండా ఆమె ఓ సినిమాలో కూడా అవకాశం తెచ్చుకోవడం విశేషం.

తిరుపతికి చెందిన వర్షిణి వర్మ టిక్ టాక్ లో తన వీడియోలను స్ట్రాట్ చేశారు. ఆ యాప్ బ్యాన్ అయిన తరువాత యూట్యూబ్ లో తన వీడియోలను కొనసాగిస్తున్నారు. బన్నీవోక్స్ పేరుతో ఆమె చేసిన వీడియోలు ఇప్పుడు పాపులర్ అయ్యాయి. ఇందులో ప్రధానంగా లిప్ సింకింగ్ అనే వీడియో ఫేమస్ కావడంతో అమ్మడు మరీ ఫేమస్ అయింది. మొదట్లో షార్ట్ ఫిల్మ్స్ లో కనిపించిన వర్షిణి ఆ తరువాత సెపరేట్ సాంగ్స్ తో డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది. అలాగే అందం, అభినయంతో అలరించిన ఈ భామ తొందర్లోనే సినిమా అవకాశం తెచ్చుకోవడంపై అందరూ ప్రశంసిస్తున్నారు.
చేతన్ శీను హీరోగా మహాస్ క్రియేషన్స్ పతాకంపై ‘విద్యార్థి’ అనే సినిమాను 2020లోనే అనౌన్స్ చేశారు. అయితే ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఇటీవల ఆ మూవీ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. మధు మాదాసు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రఘుబాబు, జీవా వంటి పెద్ద స్టార్లు నటించారు. సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఫొటోలు, వీడియోలతో అదరగొడుతున్న వర్షిణి తన మూవీకి సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తోంది.

నేటి స్టార్ హీరోయిన్లకు ధీటుగా వర్షిణి తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. సినిమాల్లో అవకాశాలు వస్తే తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే తన మొదటి సినిమా రిలీజ్ తరువాత వర్షిణి పర్ఫామెన్స్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఈ గ్యాప్ లో ముద్దుగుమ్మ తన లేటేస్ట్ ఫొటోస్ ను నెటిజన్లకు అందిస్తూ ఆకట్టుకుంటోంది.