Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ మేకింగ్ స్ట్రాటయి సంవత్సరాలు గడుస్తోంది. అయితే రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా..? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయంగా బిజీగా మారుతుండడంతో పాటు వీరమల్లు కథలో మార్పులు చేయడంతో సినిమా ఆలస్యమవుతుందని ఇన్ సైడ్ టాక్. అయితే పాత్రల మార్పుపై అప్డేట్ అందిస్తోంది మూవీ టీం. తాజాగా ఓ బాలీవుడ్ హీరోను రీప్లేస్ చేస్తూ మరో బాలీవుడ్ ను తీసుకున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరిస్తున్న ఇందులో బాలీవుడ్ నటులే ఎక్కువగా ఉండడం విశేషం.

పవన్ కొన్నాళ్లు రాజకీయాల్లో బిజీ అయిన తరువాత మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ‘వకీల్ సాబ్’ తీశాడు. ఆ తరువాత క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కోసం సైన్ చేశారు. అయితే ఈ మూవీ మేకింగ్ ఆలస్యం కావడంతో గ్యాప్ లో ‘భీమ్లానాయక్’తో తెరపైకి వచ్చారు. ఇప్పుడు సీరియస్ గా ‘వీరమల్లు’ షూటింగ్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఇటీవల రాజకీయాల్లో బిజీ అయ్యారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతుందని ఓ వైపు నుంచి టాక్ వస్తోంది. కానీ చిత్రం యూనిట్ మాత్రం పవన్ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ నటులను తీసుకున్నారు. పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈమెతో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను అనుకున్నారు. కానీ ఆమె ఈడీ విచారణను ఎదుర్కోవడంతో ఆమె ప్లేసులో నర్జీస్ ఫక్రినీ రీప్లేస్ చేశారు. ఇక ఇప్పటికే అర్జున్ రాంపాల్ పేరును ఈ సినిమా కోసం ప్రకటించారు. కానీ కొన్ని మార్పుల వల్ల ఆయన ప్లేసులో తాజాగా బాలీవుడ్ నటుడు బాబిడియోల్ ను తీసుకోనున్నట్లు ప్రకటించారు.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ గతంలో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ మల్ల యోధుడిగా కనిపిస్తారు. అంటే పవన్ తగిన విధంగా విలన్లను సెట్ చేస్తున్నారు. అయితే ఆ రేంజ్ ఉండాలంటే బాలీవుడ్ నటులను తీసుకోవాల్సి వస్తోంది చిత్ర బృందం తెలుపుతోంది. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అనేది సస్పెన్స్ గానే ఉంటోంది.