‘ఆలా వైకుంఠపురములో ‘ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రేక్షకులని పలకిరించిందే లేదు, అయితే ఆహా ప్లాట్‌ఫామ్‌లో సమంతా అక్కినేని చేస్తున్న సామ్ జామ్ షోలో ఆయన ఇటీవల సందడి చేశారు. న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 1న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో ఇటీవల విడుదలైంది. అందులో సమంత అడిగిన ప్రశ్నలకి బన్నీ చిలిపిగా సమాధానాలు ఇవ్వటం ఆకట్టుకుంది. అలాగే అల్లు అర్జున్ తన తండ్రి గురించి మాట్లాడేటప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. బన్నీ తండ్రి, టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఈ ఎపిసోడ్‌లో కనిపించటం కూడా షోలో మరో హైలైట్ అని చెప్పుకోవాలి.
Also Read: జనవరి 4 నుండి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ !
అదేవిధంగా షోలో బన్నీ అనేక వ్యక్తిగత వివరాలను కూడా వెల్లడిస్తారని ప్రోమో సూచిస్తుంది. మిమ్మల్ని స్టైలిష్ స్టార్ అని ఎందుకు పిలుస్తున్నారని సమంతా అడిగినప్పుడు, “ఎందుకు పిలవకూడదు !” అని బన్నీ ఇచ్చిన పంచ్ భలేగా ఉంది. ఇంకా అల్లు అర్జున్ తన అభిమానుల పై తనకున్న ప్రేమను కూడా తెలియచేసాడు, అభిమానులు ఇస్తున్న సపోర్ట్ చాలా గొప్పగా ఉందని వారికి విధేయుడనైపోయానని చెప్పాడు. “మేము సాధారణంగా మా తల్లిదండ్రుల నుండి మాత్రమే స్వచ్చమైన ప్రేమను పొందుతాము. కానీ నా అభిమానుల నుండి కూడా అలాంటి ప్రేమను పొందటమనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు”.
Also Read: ఆయనకే హిట్ లేదు.. ఆయనేం హిట్ ఇస్తాడు !
ఇక సినిమా విషయానికి వస్తే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది, బన్నీ ఈ సినిమాలో కొత్త అవతారంలో ప్రేక్షకులని థ్రిల్ చేయబోతున్నట్లుగా ఫిలిం నగర్ వర్గాల టాక్. ఈ చిత్రంలో పుష్ప రాజ్ అనే కూలీ స్మగ్లర్ గా మారిన పాత్రను పోషిస్తున్నాడు బన్నీ . రష్మిక ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్