https://oktelugu.com/

ఈ హెడ్ ఫోన్స్ ధర రూ.80 లక్షలు.. ఎందుకంత ఖరీదంటే..?

సాధారణంగా హెడ్ ఫోన్స్ ధర 500 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్య ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీల హెడ్ ఫోన్స్ అయితే ధర ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అయితే ఈ హెడ్ ఫోన్స్ ధర మాత్రం ఏకంగా 80 లక్షల రూపాయలు. క్వాలిటీ ఉత్పత్తులతో పేరు తెచ్చుకున్న యాపిల్ సంస్థ హెడ్ ఫోన్స్ తయారు చేస్తోంది. సాధారణంగా యాపిల్ ఉత్పత్తులు ఇతర సంస్థల ఉత్పత్తులతో పోల్చి చూస్తే ధర ఎక్కువగా ఉంటాయి. Also Read: డయాబెటిస్ రోగులు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2020 / 06:41 PM IST
    Follow us on


    సాధారణంగా హెడ్ ఫోన్స్ ధర 500 రూపాయల నుంచి 2,000 రూపాయల మధ్య ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీల హెడ్ ఫోన్స్ అయితే ధర ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అయితే ఈ హెడ్ ఫోన్స్ ధర మాత్రం ఏకంగా 80 లక్షల రూపాయలు. క్వాలిటీ ఉత్పత్తులతో పేరు తెచ్చుకున్న యాపిల్ సంస్థ హెడ్ ఫోన్స్ తయారు చేస్తోంది. సాధారణంగా యాపిల్ ఉత్పత్తులు ఇతర సంస్థల ఉత్పత్తులతో పోల్చి చూస్తే ధర ఎక్కువగా ఉంటాయి.

    Also Read: డయాబెటిస్ రోగులు గుండెను కాపాడుకోవడం ఎలా అంటే..?

    యాపిల్ సంస్థ తమ తొలి హెడ్ ఫోన్స్ ను రష్యా కంపెనీ అయిన కేవియర్ తో విలాసవంతంగా తయారు చేయించుకుంది. కేవియర్ కంపెనీ వీటిని ప్యూర్ గోల్డ్ తో తయారు చేయడం వల్ల మెష్‌ హెడ్‌బ్యాండ్‌ ను మొసలి లెదర్ తో అలంకరించడం వల్ల ఈ హెడ్ ఫోన్స్ అధర 80 లక్షల రూపాయలుగా ఉంది. అయితే కేవియర్ కంపెనీ వీటిని పరిమితంగా తయారు చేయనుంది. అయితే యాపిల్ సంస్థ సాధారణంగా కస్టమర్ల కోసం విడుదల చేసిన హెడ్ ఫోన్స్ ధర మాత్రం 59,900 రూపాయలుగా ఉంది.

    Also Read: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఓవర్ టైమ్ చేస్తే డబుల్ జీతం..?

    ధర ఎక్కువే అయినా అదిరిపోయే ఫీచర్లు ఉండటంతో చాలామంది ఈ హెడ్ ఫోన్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్ పేరుతో ఈ నెల తొలి వారంలో హెడ్ ఫోన్స్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. అడాప్టివ్‌ ఈక్వలైజర్, స్పష్టమైన శబ్దం, ఇతర ఫీచర్లతో యాపిల్ ఈ హెడ్ ఫోన్స్ ను అందుబాటులోకి తెచ్చింది.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

    కేవియర్ కంపెనీ మాత్రం యాపిల్ కంపెనీ తయారు చేస్తున్న హెడ్‌ఫోన్స్‌ కు మరింత ప్రీమియంను జత చేయాలని బంగారంతో తయారైన హెడ్ ఫోన్స్ ను రూపొందించింది. అయితే యాపిల్ ఉత్పత్తులు ధర ఎక్కువైనా ఎక్కువ కాలం మన్నిక ఇస్తుండటంతో చాలామంది ఈ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.