https://oktelugu.com/

ధర్మెగౌడ ఆత్మహత్యపై దర్యాప్తు జరిపించాలి: లోక్‌సభ స్పీకర్

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మే గౌడ ఆత్మహత్యపై ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా కోరారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్మెగౌడ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో చైర్మన్ సీట్లో కూర్చున్న ధర్మెగౌడను విపక్ష నేతలు లాగిపడేసిన విషయం తెలిసిందే. దీనిని ఉటంకించిన ఓం బిర్లా.. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన అతి పెద్ద దాడిగా పేర్కొన్నారు. శాసనసభల ప్రతిష్టను, ప్రిసైడింగ్ […]

Written By: , Updated On : December 30, 2020 / 06:29 PM IST
Follow us on

కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మే గౌడ ఆత్మహత్యపై ఉన్నతస్థాయి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా కోరారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ధర్మెగౌడ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో చైర్మన్ సీట్లో కూర్చున్న ధర్మెగౌడను విపక్ష నేతలు లాగిపడేసిన విషయం తెలిసిందే. దీనిని ఉటంకించిన ఓం బిర్లా.. ఈ ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన అతి పెద్ద దాడిగా పేర్కొన్నారు. శాసనసభల ప్రతిష్టను, ప్రిసైడింగ్ అధికారుల గౌరవం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపై ఉందన్నారు.