Bulliraju
Bulliraju : కేవలం ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిపోయిన వాళ్ళను మనం ఇది వరకు ఎంతో మందిని చూసాము. ఈమధ్య కాలంలో ఎక్కువగా హీరోయిన్స్ విషయం లో ఇది జరుగుతూ వస్తుంది. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తున్న కొత్త హీరోయిన్స్, అకస్మాత్తుగా స్టార్స్ గా మారిపోతున్నారు. కరోనా కి ముందు ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు, కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి. కొత్త జనరేషన్ ఆలోచనలు, ఇష్టాయిష్టాలు అలా అప్డేట్ అయ్యాయి మరి. హీరోయిన్స్ కాకుండా ఇటీవల కాలం లో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న వారు ఎవరు అంటే మనకు గుర్తుకు వచ్చే పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) ఫేమ్ బుల్లి రాజు(Bulliraju). ఇతని అసలు పేరు రేవంత్(Revanth). ఈ చిత్రం కమర్షియల్ గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణాలలో బుల్లి రాజు కూడా ఒకడు.
Also Read : ఓజీ’ నుండి సెన్సేషనల్ అప్డేట్..అభిమానులకు ఇక పండగే!
ఇప్పుడు ఈ బుడ్డోడికి అవకాశాలు వెల్లువలాగా కురుస్తున్నాయి. ఈ బుడ్డోడి ఒక్క రోజు కాల్ షీట్ కావాలంటే లక్ష రూపాయిల చెక్ అతని తల్లిదండ్రుల చేతిలో పెట్టాలట. అలా వాళ్ళు కోరినంత డబ్బులు నిర్మాతల చేత ఇప్పించి త్వరలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో చేయబోతున్న సినిమాలో బుక్ చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ లో రేవంత్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లోని క్యారక్టర్ కంటే అద్భుతంగా డిజైన్ చేశాడట. ప్రేక్షకులకు పొట్టచెక్కలు అవ్వాల్సిందే. చిరంజీవి కి కూడా ఈ క్యారక్టర్ తెగ నచ్చేసిందని అంటున్నారు. చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్స్ తో ఫోటోలు దిగలంటేనే అదృష్టం ఉండాలి అని అనుకునే స్థాయిలో ఉండే ఈ బుడ్డోడు, ఇప్పుడు ఊహ తెలియని వయస్సులోనే వాళ్ళ సినిమాల్లో కీలక పాత్రలు పోషించే రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు.
నూటికో కోటికో ఒకరిద్దరికి వస్తుంది ఈ అవకాశం, ఈ బుడ్డోడికి చిన్న వయస్సులోనే వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఇంకెంత రేంజ్ కి ఈ బుడ్డోడు వెళ్ళబోతున్నాడో చూడాలి. మన అందరికీ మాస్టర్ భరత్ గుర్తు ఉండే ఉంటాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఇతను ఢీ, రెడీ, వెంకీ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. రేవంత్ ని చూస్తుంటే మరో మాస్టర్ భరత్ అయ్యేలా ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు. ఈ బుడ్డోడిని తల్లిదండ్రులు ఇలాగే సినిమాల్లో కొనసాగిస్తారా?, లేకపోతే చదువుకి ఆటంకం కలుగుతుందని మధ్యలోనే ఆపించేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనుంది అని అంటున్నారు. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ కార్యాక్రమాలు పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
Also Read : అల్లు అర్జున్ లైనప్ లోకి మరో దర్శకుడు చేరిపోయాడా..?