SS Thaman-Ram Charan
SS Thaman : ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్(SS Thaman) ఒక జాతీయ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ తీవ్రమైన వివాదాలకు దారి తీసింది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు తమన్ కనిపిస్తే కొట్టేలా ఉన్నారు. యూట్యూబ్ లో కొన్ని పాటలకు వంద మిలియన్ కి పైగా వ్యూస్ రావడంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ తమ టాలెంట్ తో కేవలం పాతిక మిలియన్ వ్యూస్ మాత్రమే రప్పించగలరని, కొన్ని మెలోడీ సాంగ్స్ క్లిక్ అయితే వంద మిలియన్ వ్యూస్ కి వెళ్తుందని, కానీ ఊహకు అందని వ్యూస్ రావాలంటే కచ్చితంగా పాటల్లో హుక్ స్టెప్స్ ఉండాలని ఆయన చెప్పుకొచ్చాడు. ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) పాటలకు తాను అద్భుతమైన మ్యూజిక్ ని ఇచ్చాను, కానీ కొరియోగ్రాఫర్స్ ఒక్క హుక్ స్టెప్ కూడా పాటల్లో పెట్టలేదు. ఫలితంగా ఆ పాటలకు తగ్గ రీచ్ రాలేదు అంటూ వాపోయాడు.
Also Read : మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బుల్లిరాజు..రెమ్యూనరేషన్ ఎంతంటే
ఒక పాటకు మంచి రీచ్ రావాలంటే కొరియోగ్రాఫర్, హీరో ఇద్దరు పర్ఫెక్ట్ గా పనిచేస్తేనే వస్తుందని, గేమ్ చేంజర్ లో అది లోపించిందని ఆయన వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు తమన్ ని ట్యాగ్ చేసి ఏకిపారేశారు. మూవీ టీం మొత్తం కలిసి రామ్ చరణ్(Global Star Ram Charan) మీదకే ఫలితాన్ని నెట్టేయాలని చూస్తున్నారని, ఇది చాలా అన్యాయపూరితమైన చర్య అంటూ మండిపడుతున్నారు. అయితే రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తనపై తమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అతన్ని అన్ ఫాలో కొట్టాడని, సోషల్ మీడియా లో కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియా లో చాలా సంవత్సరాల నుండి ఫ్యాన్ వార్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ కామెంట్స్ చేశారు.
అది బాగా వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ టీం వెంటనే స్పందించింది. ‘రామ్ చరణ్ తమన్ ని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆయన మొదటి నుండి ఇన్ స్టాగ్రామ్ లో తమన్ ని ఫాలో అవ్వడం లేదు.కేవలం తన కుటుంబ సభ్యులు, స్నేహితులను మాత్రమే ఫాలో అవుతున్నాడు. సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేయకండి. రామ్ చరణ్ కి తమన్ తో మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రస్తుత రామ్ చరణ్ బుచ్చి బాబు తెరకెక్కిస్తున్న సినిమాలో విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. త్వరలోనే ఢిల్లీ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు, ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొనబోతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read: మహేష్, రాజమౌళి సినిమా పై అలాంటి ఆశలు ఉంటే పప్పులో కాలేసినట్టే!