Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పవన్ రియల్ లైఫ్ సీన్స్

పవన్ ఈమధ్య రీమేక్ సినిమాల మీద పడ్డాడు. ఆయన మొదలు పెట్టిన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలన్నీ రీమేక్ తో కూడుకున్నవే. ఇటీవల రిలీజ్ అయిన ‘బ్రో’ మూవీ కూడా తమిళ ‘వినోదయ సీతమ్ ’ రీమేక్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే.

Written By: Chai Muchhata, Updated On : August 5, 2023 10:10 am

Ustaad Bhagat Singh

Follow us on

Ustaad Bhagat Singh: ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు పవన్ కల్యాణ్. ఆయన నటించిన రీసెంట్ మూవీ ‘బ్రో’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్ట్స్ మూవీకి పనిచేయనున్నారు. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏది ముందు వస్తుందా? అని పవన్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పనులు సీరియస్ గా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ హాట్ టాపిక్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పవన్ ఈమధ్య రీమేక్ సినిమాల మీద పడ్డాడు. ఆయన మొదలు పెట్టిన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలన్నీ రీమేక్ తో కూడుకున్నవే. ఇటీవల రిలీజ్ అయిన ‘బ్రో’ మూవీ కూడా తమిళ ‘వినోదయ సీతమ్ ’ రీమేక్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. లేటెస్టుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ‘తేరీ’ అనే మూవీ ఆధారంగా తీస్తున్నారు. ఈ సినిమా పనులు సీరియస్ గా జరుగుతున్నాయి.

ముందుగా ఈ సినిమాను సాయిశ్రీనివాస్ తో కథను రాయించారు. ఆ తరువాత ఆయనే డైరెక్షన్ చేస్తారని అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు హరీష్ శంకర్ చేతిలోకి వెళ్లింది. గతంలో పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇది హరీష్ శంకర్ బాగా చేయగలడు అనే నమ్మకంతో ఆయనకు ఈ మూవీని అప్పజెప్పారు అని అంటున్నారు. అయితే ఇందులో కొన్ని సీన్స్ కల్పితం కాకుండా రియల్ గా జరిగిన సంఘటనలు చేర్చాలని చూస్తున్నారు.

పవన్ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. ఓ వైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో ఆయన తనదైన పాత్ర వేస్తున్నాడు. రాజకీయంగా ప్రజల్లో వస్తున్న ఆదరణ తెలిసిందే. ఇటీవల విశాఖలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడికి పట్టరానంత జనం వచ్చారు. అందుకు సంబంధించిన వీడియోలు లేదా అలాంటి సీన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’లో పెట్టాలని చూస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్నీ సీన్స్ కూడా చేర్చాలని చూస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్ ముందు ఈ సినిమా తెరపైకి వస్తే ఆ ప్రభావం ఎలక్షన్ లో ఉంటుందన్న చర్చ సాగుతోంది.