Brinda Movie Review: ‘బ్రింద ‘ ఫుల్ మూవీ రివ్యూ…

ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా 'సోనీ లీవ్' లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది. త్రిష కెరియర్ లో ఒక మంచి హిట్ గా మిగిలిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : August 2, 2024 12:47 pm

Brinda Movie Review

Follow us on

Brinda Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష ఇప్పటికీ మంచి సబ్జెక్టులను ఎంచుకుంటూ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ముఖ్యంగా ఆమె గ్లామరస్ పాత్రల కంటే కంటెంట్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తుంది… ఇక ఇప్పుడు ఓటిటి ఫిలింగా రూపొందిన ‘బ్రింద’ అనే సినిమాలో కూడా నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ సినిమా ఈరోజు నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ‘సోనీ లీవ్’ లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది. త్రిష కెరియర్ లో ఒక మంచి హిట్ గా మిగిలిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే బృంద (త్రిష) ఒక స్ట్రిక్ట్ పోలీస్ సూపరింటెండెంట్ గా తన బాధ్యతలను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సిటీలో వరసగా మర్డర్లు జరుగుతూ ఉంటాయి. అలాగే పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఒక అడవి ప్రాంతంలో ఉన్న వాళ్లు ఒక చిన్నారిని బలి ఇవ్వాలని అనుకుంటారు. మరి దానికి గల కారణం ఏంటి? చిన్నారిని బలివ్వడానికి ఈ మర్డర్లకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు ఈ హత్యలన్నింటిని చేయిస్తుంది ఎవరు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ‘సూర్య మనోజ్ వంగల’ ఈ సినిమా కథ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ముందుగా ఈ సినిమా కథలో మంచి డెప్త్ ఉంది. కాబట్టి ఆ స్టోరీ లోని మెయిన్ పాయింట్ ను హైలెట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక చిన్నారిని బలి ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ ను కూడా హైలెట్ చేస్తు డైరెక్టర్ మిగతా సబ్ ప్లాట్స్ అన్నింటినీ జాగ్రత్తగా అమర్చుకొని దానికి తగ్గట్టుగా ఒక స్క్రీన్ ప్లే ను డెవలప్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాని ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి…ఇక సినిమా మొత్తం లో సస్పెన్స్ ను క్రియేట్ చేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ట్విస్ట్ లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇక దానివల్లే ఈ సినిమాని చూసే ప్రేక్షకుడికి మైండ్ లో ఒక అటెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది.

ఎక్కడ కూడా దర్శకుడు డివియేట్ అవ్వకుండా తను అనుకున్న కథని 100% ఎఫర్ట్ పెట్టి చూపించే ప్రయత్నం అయితే చేశాడు. అందులో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు… సస్పెన్స్ తో పాటు ఈ సినిమాలో ఎమోషన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఒక దర్శకుడు ఎమోషన్స్ ను ఎప్పుడైతే ప్రేక్షకుడికి నచ్చే విధంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలుగుతాడో ఆ సినిమా ఈజీగా సక్సెస్ ని అందుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో కూడా ఎమోషన్ చాలా హైలెట్ అయిందనే చెప్పాలి…

ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో బ్యా గ్రౌండ్ స్కోర్ అంత బాగా సెట్ అవ్వకపోయిన కూడా ఆ సీన్స్ లో ఉన్న డెప్త్ సినిమాని ముందుకు నడిపించింది. ఇక ఈ సినిమాలో త్రిష కూడా అద్భుతమైన నటనను కనబరిచి సినిమా సక్సెస్ లో తను కూడా చాలా కీలకపాత్ర వహించింది. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా హై లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన త్రిష తన బెస్ట్ పర్ఫామెన్స్ తో సినిమా మీద మంచి హైపు ను తీసుకురావడమే కాకుండా సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని దాంట్లో లీనమయ్యేలా నటించి మెప్పించింది… ఇక ఆమె ఎంటైర్ కెరియర్ లో చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇంద్రజిత్తు సుకుమారన్ కూడా తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో పర్ఫామెన్స్ అయితే చాలా సెటిల్డ్ గా చేశాడు.ఇక జయప్రకాష్ కూడా తను కనిపించిన సీన్లలో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసే విధంగా ఓకే అనిపించాడు. ఇక ఆమని సైతం మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంది…ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన శక్తి కాంత్ కార్తీక్ మ్యూజిక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. ఇంకొంచెం ఎఫెక్టివ్ మ్యూజిక్ ని కనుక ఇచ్చినట్లయితే ఈ సినిమా టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్లేది. ఇక సినిమాటోగ్రాఫర్ అయిన దినేష్ కే బాబు విజువల్స్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. కొన్ని షాట్స్ ను తీయడంలో నిజంగా ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సస్పెన్స్ ను గొలిపే సీన్లను తీయడంలో ఆయన విజువల్స్ టాప్ లెవెల్లో ఉన్నాయి… ఇక ఎడిటర్ అన్వర్ అలీ కూడా చాలావరకు షార్ప్ ఎడిటింగ్ చేసినప్పటికీ కొన్ని సీన్లు మాత్రం కొంచెం లాగ్ చేసినట్టుగా అనిపించింది. మరి దర్శకుడి సూచనల మేరకు ఆ సీన్లను అలాగే ఉంచాడా? లేదంటే ఆయనే కావాలని అలా చేశాడా? అనే విషయంలో సరైన క్లారిటీ లేదు…

ప్లస్ పాయింట్స్

కథ
స్క్రీన్ ప్లే
త్రిష యాక్టింగ్

మైనస్ పాయింట్స్

మ్యూజిక్
కొన్ని లాగ్ సీన్స్..

రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది…