Paris Olympics 2024: తినడానికి ఏమైనా పెట్టండి.. పారిస్ లో ఒలింపిక్ కాంస్యపతక విజేత ఆర్తనాదాలు..

ఇండియా హౌస్ లో భారతీయ వంటకాలను వండడానికి మన దేశం నుంచి ప్రఖ్యాత పాకశాస్త్ర నిపుణులు వెళ్లారు. అక్కడ కొద్ది రోజులుగా మన క్రీడాకారులకు నచ్చిన వంటకాలను తయారు చేస్తూ.. వడ్డిస్తున్నారు. మిక్స్ డ్ డబుల్స్ షూటింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన అనంతరం మను భాకర్ (Manu bhakar), సరభ్ జ్యోత్ సింగ్(Sarbjot singh) తమకు నచ్చిన ఆహారం తిన్నారు..

Written By: Anabothula Bhaskar, Updated On : August 2, 2024 12:41 pm
Follow us on

Paris Olympics 2024 : లక్షల కోట్ల బిలియనీర్ అయినా.. రోజుకు వందల్లో సంపాదించే కూలీకి అయినా.. ఆకలి ఒకటే. తినే తిండి మాత్రమే వేరు.. అందుకే కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత పుట్టింది. ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన ఓ క్రీడాకారుడికి కడుపునిండా తిండి కూడా లభించలేదు. చివరికి ఈ విషయం వెలుగులోకి రావడంతో రచ్చ రచ్చ అవుతోంది. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. ” గొప్పగా ఒలింపిక్స్ నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశామని అంటున్నారు. ఆటగాళ్లకు చివరికి కడుపునిండా అన్నం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయిందని” నెటిజన్లు ఒలింపిక్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ సత్తా చాటుతోంది.. ఇప్పటికే మూడు పతకాలు సొంతం చేసుకుంది. ఇవన్నీ కూడా షూటింగ్ విభాగంలో వచ్చాయి. అయితే మరిన్ని మెడల్స్ సాధించేందుకు భారత క్రీడాకారులు చెమటోడ్చుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పీవీ సింధు ప్రీ క్వార్టర్స్ లో ఇంటిదారి పట్టింది. నిఖత్ జరీన్ కూడా ఓటమి పాలయింది. అయితే షూటింగ్ లో పది మీటర్ల మిక్స్ డ్ విభాగంలో మను(Manu bhakar), సరభ్ జ్యోత్ సింగ్(Sarbjot singh) ద్వయం కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం అనంతరం మను భాకర్ (Manu bhakar), సరభ్ జ్యోత్ సింగ్(Sarbjot singh) ఇండియా హౌస్ వెళ్లారు. వారిద్దరికీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ, అభిమానులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. కొందరు అభిమానులు మను(Manu bhakar), సరభ్ జ్యోత్ సింగ్(Sarbjot singh) తో ఫోటోలు దిగి, సెల్ఫీలు తీసుకొని సందడి చేశారు. ఇదే క్రమంలో సరభ్ జ్యోత్ సింగ్(Sarbjot singh) కు విపరీతమైన ఆకలి వేసిందట..”భయ్యా ఈ సంబరాలు చాలుగాని.. విపరీతమైన ఆకలి వేస్తోంది.. తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి” అని అడిగాడట. దీంతో సౌరభ్ తో పాటు మిగతా వారందరికీ పానీ పూరీ, భేల్ పూరీ, దోసె వడ్డించారట.

వాస్తవానికి ఒలింపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్లకు కఠినమైన ఆహార నియమాలు ఉంటాయి. వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలో, ఎటువంటి ఆహారం తినకూడదో పదే పదే కోచ్ లు, సహాయక కోచ్ లు, డైటీషియన్లు చెబుతుంటారు. అందువల్ల తినాలి అనే కోరిక ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు మెడల్ దక్కించుకోవాలనే లక్ష్యంతో నోటికి తాళం వేసుకుంటారు.. ఒకవేళ మెడల్ సాధిస్తే.. వెంటనే తమకు నచ్చిన ఆహారం తినేందుకు వారంతా ఎంతో ఆతృతగా వారి దేశాలకు చెందిన ప్రాంతాలకు (ఒలింపిక్ నిర్వాహకులు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తుంటారు) వెళుతుంటారు. ప్రస్తుతం పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో భారత క్రీడాకారులకు ఇండియా హౌస్ కొత్త ప్రాంతం లాగా రూపాంతరం చెందింది. గేమ్ పూర్తయిన తర్వాత భారత క్రీడాకారులు ఇండియా హౌస్ కి వచ్చి తమకు నచ్చిన ఆహారాన్ని తినేస్తున్నారు. ఇండియా హౌస్ ను పారిస్ ఒలింపిక్స్ లో తొలిసారి ఏర్పాటు చేశారు. ఆటగాళ్లను సన్మానించేందుకు, ఆటగాళ్లు తమ విజయాలను జరుపుకునేందుకు ఇండియా హౌస్ ను వేదికగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియా హౌస్ లో అనేక రకాల భారతీయ వంటకాలు వండుతున్నారు.

ఇండియా హౌస్ లో భారతీయ వంటకాలను వండడానికి మన దేశం నుంచి ప్రఖ్యాత పాకశాస్త్ర నిపుణులు వెళ్లారు. అక్కడ కొద్ది రోజులుగా మన క్రీడాకారులకు నచ్చిన వంటకాలను తయారు చేస్తూ.. వడ్డిస్తున్నారు. మిక్స్ డ్ డబుల్స్ షూటింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించిన అనంతరం మను భాకర్ (Manu bhakar), సరభ్ జ్యోత్ సింగ్(Sarbjot singh) తమకు నచ్చిన ఆహారం తిన్నారు..భేల్ పూరి ఇష్టంగా లాగించారు.. పానీ పూరీని మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. దోసెల ను తృప్తిగా తిన్నారు. “మెడల్ సాధించాలనే లక్ష్యంతో ఇన్నాళ్లు నోరు కు తాళం వేసుకున్నాం. ఒకరకంగా పారిస్ వీధులలో ఆకలితో ఆర్తనాదాలు చేశాం (నవ్వుకుంటూ). ఇప్పుడు మాత్రం నచ్చినవి తిన్నాం. కొద్దిరోజుల వరకు నచ్చినవే తింటాం. మెడల్ సాధించాం కాబట్టి నోటికి తాళం వేయాల్సిన అవసరం లేదు. మా కోచ్, సహాయక కోచ్ లు కూడా నిబంధనలు విధించలేరు” అంటూ సరభ్ జ్యోత్ సింగ్(Sarbjot singh) పేర్కొన్నాడు. అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.