https://oktelugu.com/

Brahmaji And Hyper Aadi: బ్రహ్మాజీ వెనకనుంచి హైపర్ ఆది చేసిన పని… వైరల్ వీడియో

గత కొంతకాలంగా బ్రహ్మాజీ బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు. సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూనే ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి చానెల్స్ లో రకరకాల కార్యక్రమాలలో కనిపిస్తున్నాడు.

Written By: , Updated On : March 24, 2024 / 11:28 AM IST
Brahmaji And Hyper Aadi

Brahmaji And Hyper Aadi

Follow us on

Brahmaji And Hyper Aadi: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వింత వింత పనులు చేస్తున్నారు. వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగులో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఉన్న బ్రహ్మాజీ, బుల్లితెర నటుడు హైపర్ ఆదితో కలిసి చిన్నపాటి వీడియో లో డాన్స్ వేసి సందడి చేశాడు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను బ్రహ్మాజీ తన సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోకు ‘ఇది మరొక నాటు నాటు పాట” అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.. ఈ వీడియోలో ఓ కన్నడ పాట ప్లే అవుతుండగా బ్రహ్మాజీ ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా కాళ్లు, చేతులు కదిపేందుకు ప్రయత్నించాడు. బ్రహ్మాజీ వెనుక ఉన్న హైపర్ ఆది అతడిని ఇమిటేట్ చేశాడు.

గత కొంతకాలంగా బ్రహ్మాజీ బుల్లితెర మీద సందడి చేస్తున్నాడు. సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూనే ఈటీవీ, జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు వంటి చానెల్స్ లో రకరకాల కార్యక్రమాలలో కనిపిస్తున్నాడు. ఆ మధ్య సుమ యాంకర్ గా వ్యవహరించిన క్యాష్ ప్రోగ్రామ్ లో బ్రహ్మాజీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒదిగిపోయి నటించే బ్రహ్మాజీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మంచి పాత్ర పడాలే గాని బ్రహ్మాజీ ఇరగదీయగలడు.. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలో పాత్రే అందుకు నిదర్శనం. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ పాత్రకు సంబంధించిన మీమ్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి.

ఇక ఈ కన్నడ పాటకు సంబంధించి బ్రహ్మాజీ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది. బ్రహ్మాజీ వెనుక ఉండి హైపర్ ఆది చేసిన ఇమిటేట్ డాన్స్ కొంతమంది ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వారు చేస్తున్న కామెంట్లే ఇందుకు ఉదాహరణ. “బ్రహ్మాజీ గారు మీరు సీనియర్ నటులు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. సింధూరం వంటి సినిమాలో మీరు పోషించిన పాత్ర సూపర్. అలాంటి మీరు బూతులు మాట్లాడే హైపర్ ఆదితో డ్యాన్స్ చేయడం ఏంటి? మీ స్థాయిని తగ్గించుకోకండి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ” మీరిద్దరు మంచిగా డాన్స్ చేశారు. మాకు నవ్వు తెప్పించారు. మీరు ఇలాగే నవ్విస్తూ ఉండాలని” వ్యాఖ్యానించారు.

Hyper Aadi Funny Dance With Brahmaji | #jabardasth #hyperaadi #brahmaji #funny #shorts #tollywood