Shah Rukh Khan: దేశభక్తి సినిమాలు తీశాడు.. తీరా ఐపీఎల్ లో అందరి ముందే ఆ పనిచేసిన స్టార్ హీరో

బాలీవుడ్ సూపర్ స్టార్ గా షారుక్ ఖాన్ తో పేరుంది. ఇటీవల వచ్చిన పఠాన్ షారుక్ ఖాన్ కు బంపర్ హిట్ అందించింది. బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేసింది.. అయితే ఆ తర్వాత షారుక్ నటించిన ప్రయోగాత్మక చిత్రం డుంకీ విపల ప్రయత్నంగా మిగిలింది.

Written By: Anabothula Bhaskar, Updated On : March 24, 2024 11:54 am

Shah Rukh Khan

Follow us on

Shah Rukh Khan: అతడు బాలీవుడ్ స్టార్ హీరో. ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. సమాజాన్ని జాగృతపరిచే పాత్రల్లో మెప్పించాడు. డాన్ గా ఒదిగాడు. సైనికుడిగా అలరించాడు.. శాస్త్రవేత్తగా మెప్పించాడు. 60 ఏళ్ల వయసు దాటినప్పటికీ కుర్ర పాత్రల్లో నటిస్తూ బాలీవుడ్ జనాల్ని కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే అంతటి నటుడు ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సామాజిక బాధ్యత కలిగి ఉండాల్సిన అతడు అభిమానుల నుంచి చివాట్లు తింటున్నాడు.

బాలీవుడ్ సూపర్ స్టార్ గా షారుక్ ఖాన్ తో పేరుంది. ఇటీవల వచ్చిన పఠాన్ షారుక్ ఖాన్ కు బంపర్ హిట్ అందించింది. బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లు వసూలు చేసింది.. అయితే ఆ తర్వాత షారుక్ నటించిన ప్రయోగాత్మక చిత్రం డుంకీ విపల ప్రయత్నంగా మిగిలింది. అయితే అటువంటి షారుఖ్ ఖాన్ శనివారం చేసిన ఒక పని ఆయనను తీవ్ర విమర్శలకు గురిచేస్తోంది. ఐపీఎల్ లో భాగంగా షారుక్ ఖాన్ యజమానిగా వ్యవహరిస్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడింది. తొలుత కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 208 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన హైదరాబాద్ లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలోనే కోల్ కతా బౌలర్ స్టార్క్ 19 ఓవర్లో 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ సమయంలో కోల్ కతా జట్టు దాదాపుగా ఓటమి అంచులో నిలిచింది. ఈ సందర్భంగా స్టేడియం నుంచి మ్యాచ్ చూస్తున్న కోల్ కతా జట్టు యజమాని షారుఖ్ ఖాన్ ఒత్తిడికి గురయ్యాడు. ఆ సమయంలోనే సిగరెట్ తాగుతూ కనిపించాడు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షారుక్ ఖాన్ సిగరెట్ తాగిన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.” బాలీవుడ్ సూపర్ స్టార్ అంటారు. ఆయన కోసం అభిమానులు పడి చస్తుంటారు.. అంతమంది అభిమానాలను పొందిన అతడు ఆదర్శంగా ఉండాల్సింది పోయి.. ఇలా మైదానంలో క్రికెట్ చేస్తూ సిగరెట్ తాగుతున్నాడు. ఇది ఎంతవరకు సరైనదో ఆయనకే తెలియాలి.. ఇలా సిగరెట్ తాగుతుంటే కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఓ సూపర్ లీగ్ లోనూ ఐదు వికెట్లు తీసిన ఓ బౌలర్ కూడా మ్యాచ్ మధ్యలో వచ్చి సిగరెట్ తాగాడు. అతడు సిగరెట్ తాగిన దృశ్యాలు బయటికి వచ్చాయి. దీంతో అతనిని పాకిస్తాన్ మీడియా ఏకీపారేసింది. బాధ్యత గల క్రికెటర్ కు బాధ్యత లేదా అంటూ దెప్పిపొడిచింది. అయితే షారుక్ ఖాన్ సిగరెట్ తాగిన దృశ్యాలపై మరికొంతమంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తన జట్టు ఓటమి అంచుల్లో ఉన్నప్పుడు.. ఆ ఒత్తిడిని భరించలేక సిగరెట్ తాగితే తప్పేంటని వాదిస్తున్నారు. మొత్తానికి షారుఖ్ ఖాన్ సిగరెట్ తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి. మరి దీనిపై ఇంతవరకు షారుఖ్ ఖాన్ ఎటువంటి కామెంట్స్ చేయలేదు.