మాస్ డైరెక్టర్.. వరుస హిట్స్.. పైగా ఓ పొలిటికల్ పార్టీ అండదండలు.. పార్టీ యాడ్స్ తోనే కోట్లు సంపాదన.. మొత్తంగా యాక్షన్ అంటూ హడావుడి చేసే ‘బోయపాటి శ్రీను’ గతం ఇది. కానీ, రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత, బోయపాటి కాస్త బోయవాడి పిట్ట కోసం వెతుక్కునట్లు సినిమా కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ గతంలో ఇచ్చిన హిట్స్ ఫలితంగా బాలయ్య బాబు, పిలిచి అవకాశం ఇచ్చాడు. అయితే బాలయ్యతో సినిమా సెట్ చేసుకోవడానికి నిర్మాతలను ఒప్పించుకోవడానికి బోయపాటి చాల టైం తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బోయపాటికి ఎన్నో అవరోధాలు.. అన్ని అడ్డంకులు దాటుకుని చివరికి కరోనా ముందు సినిమా ఆపెసుకుని ఏం చేయాలో తెలియని స్థితిలో బోయపాటి ఉండిపోయాడు.
Also Read: త్రిష నా కెరీర్ నాశనం చేసింది.. నటి సంచలన ఆరోపణ
నిజానికి కరోనా తగ్గాక సినిమా మొదలుపెట్టే ఆలోచనలో మొన్నటివరకూ బోయపాటి ఉన్నా … ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బడ్జెట్ విషయంలో మార్పులు చేయాలి. నిర్మాత 10 కోట్లు వరకూ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించమని ఆర్డర్ జారీ చేశాడు. ఇప్పుడు మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేయాలి. బడ్జెట్ తగ్గించే సీన్స్ ను మళ్ళీ రాసుకోవాలి. ఆ సీన్స్ బాలయ్య బాబుకు నచ్చాలి. బాబుకు నచ్చాలి అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు, మొత్తానికి కరోనా తగ్గినా బోయపాటికి ఇప్పట్లో షూటింగ్ అయితే ఉండదు. పాపం ఒక్క ప్లాప్ కే బోయపాటి మరీ ఇంత చులకన అయిపోతాడనుకోలేదు.
Also Read: అరివీర భయంకర.. అధీరా!
కనీసం ఇంతకుముందు బాలయ్య – బోయపాటి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాల విజయాలను చూసైనా నిర్మాత బడ్జెట్ ఇవ్వాల్సిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తొన్నా.. గత కొన్ని సినిమాలుగా బాలయ్యకు పది కోట్లు మార్కెట్ లేదు. మరి ప్లాప్ ల్లో ఉన్న బాలయ్య మీద నలభై ఏభై కోట్లు అంటే కచ్చితంగా రిస్క్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్స్ వచ్చినా.. ప్రధానంగా ‘మోనార్క్’ అండ్ ‘డేంజర్’ అనే టైటిల్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇక సినిమా టీజర్ ను ‘బీబీ3′ పేరుతో విడుదల చేసినా పెద్దగా సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా ప్లాప్ వస్తే ఇక కెరీర్ ను ముగించడం మంచింది.