నర్సరీకే వేలకు వేల ఫీజులు.. ఇక పదోతరగతి వచ్చేవరకు లక్షలు స్కూలు ఫీజుగా కట్టాలి. ఇంటర్ విద్య భరించలేనంతగా ఉంది. ఈ దేశంలోనే అన్నింటికంటే మంచి వ్యాపారం ‘విద్య’నే. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పడకేసిన వేళ ప్రైవేట్ దోపిడీ ఎక్కువైపోయింది. విద్య దేశంలో మంచి వ్యాపారమైంది. నర్సరీకే 30వేల వరకు ఫీజులు వసూలు చేస్తుండగా.. పదోతరగతి వరకు లక్ష రూపాయాలపైనే ముక్కుపిండి తీసుకుంటున్నారు. తల్లిదండ్రులంతా సంపాదన అంతా పిల్లల స్కూల్ ఫీజులకే పోతున్న దైన్యం దేశంలో ఉంది. ఇక ఇంటర్ విద్యా అంటేనే లక్షల్లో పని. ఎంసెట్, ఇంజినీరింగ్ కోర్సుల కోసమంటూ పది లక్షల వరకు ప్యాకేజీలతో తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. దేశంలో ఇలాంటి భ్రష్టుపట్టిన విద్యావ్యవస్థను ప్రధాని మోడీ ప్రక్షాళన చేశారు. ప్రైవేట్ కు కాసులు కురిపిస్తున్న ‘ఇంటర్’ విద్యనే లేపేశారు.
Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?
దేశంలో విద్యావిధానంలో కేంద్రం సంచలన మార్పులకు శ్రీకారం చుట్టింది. నూతన జాతీయ విద్యావిధానానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏకంగా మానవ వనరుల అభివృద్ధి శాఖను ‘విద్యా మంత్రిత్వశాఖ’గా మార్పు చేసింది.
ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలు చేసింది. ఇకపై ఆర్ట్స్, సైన్స్ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. బహు బాషలను ప్రోత్సహించే క్రమంలో 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన చేయనున్నారు.
మోడీ ఏకంగా 3-18ఏళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశ పెట్టి 2030 వరకు అందరికీ విద్యను అందించడమే ధ్యేయంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
అన్నింటికంటే లక్షల ఫీజులు ఉండే ఇంటర్ విద్యను తీసేశారు. ప్రస్తుతం 10వతరగతి తర్వాత ఇంటర్ రెండేళ్లు , డిగ్రీ 3 ఏళ్ల విద్యా విధానం మార్చేసి.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం ఉంటుదని తేల్చేశారు. డిగ్రీ విద్య 3 నుంచి నాలుగేళ్లు.. పీజీ ఏడాది నుంచి రెండేళ్లు ఉంటుంది.
Also Read: బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?
దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకే కరికులమ్ పెట్టి.. పాఠ్యాంశాల భారం తగ్గిస్తూ విద్యార్థుల మానసిక ఒత్తిడిని మోడీ సర్కార్ తగ్గించింది. ఇక ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తూ విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేలా 6వ తరగతి నుంచే వొకేషనల్ , కోడింగ్, ప్రోగ్రామింగ్ కరికులమ్ కోర్సులు ప్రవేశపెట్టింది.
ఇలా మోడీ బట్టి విధానంతో ర్యాంకుల వెంట పడే ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలకు చెక్ పెట్టింది. విద్యార్థుల్లోని తెలివితేటలను పెంచేలా సమూలంగా మార్చేసింది. ఇక నుంచి ర్యాంకులు, బట్టి విధానం ఉండకుండా విద్యార్థుల మేథోశక్తిని పెంచేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దింది. మోడీ ప్రవేశపెట్టిన జాతీయ విద్యావిధానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దేశ విద్యను సమూలంగా మార్చిన మోడీపై విద్యావేత్తలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
-ఎన్నం