https://oktelugu.com/

‘రొమాంటిక్’లో ‘ఎన్టీఆర్ అత్త’ !

సినిమా ఇండస్ట్రీలో సన్ స్ట్రోక్స్ చాల సహజం. అయినా తమ వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి.. తమకున్న అన్ని ఆర్ధిక శక్తులను ఒడ్డి, సర్వస్వం పోగొట్టుకున్న దర్శకనిర్మాతలు ఫిల్మ్ నగర్ లో వినిపించే ప్రతి కామెంట్ వెనుక ఒక్కరు ఉంటారు. ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే హీరో అనే క్రెడిట్ అంత కిక్ ను ఇస్తోంది మరి. అయితే అలాంటి సన్ స్ట్రోక్ యవ్వారమే పూరి ఫ్యామిలీది. తన కొడుకు ఆకాష్ పూరి కోసం పూరి జ‌గ‌న్నాథ్ తనకున్న […]

Written By:
  • admin
  • , Updated On : July 30, 2020 / 02:59 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీలో సన్ స్ట్రోక్స్ చాల సహజం. అయినా తమ వారసులను ఇండస్ట్రీలో నిలబెట్టడానికి.. తమకున్న అన్ని ఆర్ధిక శక్తులను ఒడ్డి, సర్వస్వం పోగొట్టుకున్న దర్శకనిర్మాతలు ఫిల్మ్ నగర్ లో వినిపించే ప్రతి కామెంట్ వెనుక ఒక్కరు ఉంటారు. ఎప్పటికీ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే హీరో అనే క్రెడిట్ అంత కిక్ ను ఇస్తోంది మరి. అయితే అలాంటి సన్ స్ట్రోక్ యవ్వారమే పూరి ఫ్యామిలీది. తన కొడుకు ఆకాష్ పూరి కోసం పూరి జ‌గ‌న్నాథ్ తనకున్న కాస్త డబ్బును పెట్టుబడిగా పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ పూరి మొదటి సినిమాకే పూరికి పదిహేను కోట్లు వరకూ లాస్ అని పూరి ఆఫీస్ నుండే బయటకు రూమర్స్ వినపడ్డాయి.

    Also Read: త్రిష నా కెరీర్ నాశనం చేసింది.. నటి సంచలన ఆరోపణ

    ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్‘ కోసం కూడా పూరి జ‌గ‌న్నాథ్ బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. పైగా సినిమాలో మాజీ హాట్ బ్యూటి నగ్మా కూడా నటిస్తోంది. ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడం కోసం ఈ విషయన్నిదాచారట.

    నగ్మా ఈ చిత్రంలో హీరోయిన్ కేతిక శర్మకి తల్లిగా నటిస్తోందని.. అంటే ఆకాష్ పూరికి నగ్మా అత్తగా కనిపించబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. గతంలో నగ్మా ఎన్టీఆర్ కి అత్తగా కనిపించి బాగానే అలరించింది. ఇప్పటికీ ఏ మాత్రం అందం ఒంటిలో బిగువు తగ్గని ఈ మాజీ బ్యూటీ మోడ్రన్ అత్తగా అలరిస్తుందనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. నగ్మా లాంటి ఆల్ టైం బ్యూటీని ఆకాష్ పూరికి అత్త అని పిలవడం కాస్త ఇబ్బందే.

    Also Read: మొహమాటం లేకుండా డైరెక్ట్ గా హీరోనే అడిగేసింది!

    ఏమైనా హాట్ అండ్ మోడ్రన్ అత్త పాత్రలకు నగ్మా పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ‘రొమాంటిక్’ సినిమాలో ఘాడమైన ప్రేమ సన్నివేశాలతో పాటు యూత్ ను బాగా ఆకట్టుకునే బోల్డ్ సీన్స్ అండ్ సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది. మాఫియా నేపథ్యంలో జరిగే ఓ ప్రేమ కథగా వస్తోన్న ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా.. రాకపోతే మాత్రం పూరి దుకాణం సర్ధేసుకోవడమే. ఎందుకంటే పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై ఈ చిత్రాన్ని నిర్మించడానికి పూరి బాగా ఖర్చుపెట్టాడు.