Boyapati Ram Movie: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీను ‘అఖండ’తో అఖండమైన విజయాన్ని సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. కాగా ఈ రోజు బోయపాటి శ్రీను పుట్టినరోజు. తమ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ‘రామ్ సినిమా టీమ్’ బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేసింది. బోయపాటికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.

అయితే, ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట. 110 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. ఒక విధంగా ఇది రామ్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్. మరి రామ్ కి 60 కోట్లు మార్కెట్ మాత్రమే ఉంది. 110 కోట్ల స్థాయి మార్కెట్ రామ్ కి లేదు. కాకపోతే.. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి.
ఇక ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. రామ్, ఎప్పటి నుండో మాస్ హీరోగా ఎలివేట్ అవ్వాలని ఆశ పడుతున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి రామ్ కి ఒక కథ చెప్పాడు. కథ కూడా రామ్ కి బాగా నచ్చింది.

అందుకే.. బోయపాటి కోసం రామ్ తన రెమ్యునరేషన్ ను కూడా తగ్గించుకున్నాడు. పైగా రామ్ తో చేస్తున్న చిత్రానికి బోయపాటి, హీరో రామ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్న ఈ చిత్రానికి రామ్ రూ.11 కోట్లు తీసుకుంటే, బోయపాటి రూ.13 కోట్లు తీసుకుంటున్నాడు. మొత్తానికి, బోయపాటి హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ 12 కోట్లు తీసుకున్నాడు. అయితే, బోయపాటి సినిమా కోసం మాత్రం రామ్ తన రెమ్యునరేషన్ ను తగ్గించుకున్నాడు. ఏది ఏమైనా అఖండ మహిమ ఇంకా గట్టిగానే పని చేస్తోంది. అఖండ సినిమా రికార్డు కలెక్షన్స్ దక్కించుకోవడం, బోయపాటికి తిరుగులేకుండా పోయింది.