KCR Government: ప్రేక్షకుల జేబుకు మళ్లీ చిల్లు.. కేసీఆర్ ప్రభుత్వం అనుమతి !

KCR Government: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ప్రస్తుతం ఈ సినిమా టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎగబడుతున్నారు. ఇక ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి అంటూ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ప్రేక్షకుల జేబుల్లో మళ్లీ చిల్లు పెట్టడానికి అనుకూలంగా ఒక జీవోని రిలీజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కాకపోతే, […]

Written By: Shiva, Updated On : April 26, 2022 1:53 pm
Follow us on

KCR Government: క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ‘మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్’ కలయికలో రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆచార్య’. కాగా ప్రస్తుతం ఈ సినిమా టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎగబడుతున్నారు. ఇక ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉండబోతున్నాయి అంటూ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ప్రేక్షకుల జేబుల్లో మళ్లీ చిల్లు పెట్టడానికి అనుకూలంగా ఒక జీవోని రిలీజ్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం.

KCR

కాకపోతే, ఇది ఆచార్య టీమ్ కి శుభవార్తనే. తెలంగాణలో ఈ సినిమా టికెట్స్ ధరలను పెంచుకునే వెసులుబాటును తెలంగాణా గవర్నమెంట్ ఆచార్యకి కల్పించింది. అందుకు తగ్గట్టు తాజాగా ఒక జీవోని కూడా జారీ చేసింది. ఈ జీవో ప్రకారం మల్టీఫ్లెక్స్, లార్జ్ స్క్రీన్ థియేటర్స్, రీ క్లీనింగ్ సీట్స్ కలిగిన థియేటర్స్ రూ. 50 వరకు అదనంగా టికెట్ ధరలు పెంచుకోవచ్చు.

ఇక సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్స్ లో రూ. 30 అదనంగా టికెట్ ధరను పెంచుకునే అవకాశాన్ని ఆచార్యకి కల్పించారు. అంటే.. పెరిగిన ఈ టికెట్స్ ధరలు రూ. 210, రూ. 350లుగా ఉండనున్నాయి. పైగా మొదటి వారం రోజులు పాటు ఈ టికెట్స్ ధరల పెంపునకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సామాన్యుడి జేబులను గుల్ల చేయడానికే కేసీఆర్ ప్రభుత్వం ఈ పని చేసిందా ?

Acharya

ఇప్పటికే అన్నీ ధరలు పెరిగిపోయాయి. ఇలా పెద్ద సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారీ పెద్ద సినిమా టికెట్ రేట్లు కూడా పెరిగిపోతే ఎలా ? అసలు ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తోందా? ప్రముఖుల కోసం పని చేస్తోందా ?, ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే.. ఇక వారి ఇష్టం వచ్చినట్టు ధరలను పెంచుకోవచ్చా ? అదే పంటల ధరలను పెంచడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు రాదు.

ఇక బలమైన నేపథ్యంతో భారీగా తెరకెక్కిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సహజంగానే మెగా హీరోల సినిమాలకు భారీగా బిజినెస్ జరుగుతుంది. ఇక ‘ఆచార్య’ లాంటి సినిమాకు ఏ స్థాయిలో బిజినెస్ జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 151 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సైరా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమా పై పాన్ ఇండియా ఇమేజ్ కూడా పడింది. కాబట్టి, డబ్బింగ్ వెర్షన్స్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా కలుపుకుంటే.. మరో నలభై కోట్లు వరకు ఉంటుంది. అంటే.. మొత్తం ఆచార్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ 192 కోట్లు జరిగింది.

Recommended Videos:

Tags