Child Care: తల్లీదండ్రులు చిన్నపిల్లలకు తినిపించే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం విషయంలో పొరపాట్లు చేస్తే పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంటుందని తెలుస్తోంది. కొన్ని ఆహారాలను పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తినిపించకూడదు. కొన్ని ఆహారాలను పిల్లలకు తినిపించడం వల్ల పిల్లల ఆరోగ్యానికి అపాయం కలిగే అవకాశాలు అవకాశాలు అయితే ఉంటాయి.
పిల్లల కోసం తీసుకునే ఆహార పదార్థాలలో ఏవైనా కెమికల్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. కెమికల్స్ తో కూడిన ఆహార పదార్థాల వల్ల పిల్లలకు నష్టమే తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే. వెన్న పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. వేరుశనగలతో చేసిన వంటకాలకు సైతం పిల్లల్ని దూరంగా ఉంచితే మంచిదని చెప్పవచ్చు. పిల్లలకు సముద్రపు ఆహారం కూడా అస్సలు పెట్టకూడదు.
కొన్ని చేపలలో పాదరసం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించడం గమనార్హం. కాల్చిన మాంసాన్ని పిల్లలకు తినిపించడం కూడా పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకు వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన వంటకాలను తినిపిస్తే వాళ్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు.