అఘోరని కంట్రోల్ చేస్తున్న బోయపాటి

సింహ , లెజెండ్ చిత్రాల తరవాత బాలకృష్ణ . బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూవీ అనగానే అందరిలో ఆసక్తి పెరిగింది ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు భారీ హిట్లు రావడం తో ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టు గానే రూపుదిద్దు కొంటున్న ఈ చిత్రం లో అంజలి హీరోయిన్ గా నటిస్తోంది .కాగా శ్రీయ శరన్ కూడా నటిస్తున్న ఈ చిత్రం […]

Written By: admin, Updated On : April 17, 2020 6:38 pm
Follow us on


సింహ , లెజెండ్ చిత్రాల తరవాత బాలకృష్ణ . బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న మూవీ అనగానే అందరిలో ఆసక్తి పెరిగింది ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు భారీ హిట్లు రావడం తో ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని అందరూ బలంగా నమ్ముతున్నారు.

అందరి అంచనాలకు తగ్గట్టు గానే రూపుదిద్దు కొంటున్న ఈ చిత్రం లో అంజలి హీరోయిన్ గా నటిస్తోంది .కాగా శ్రీయ శరన్ కూడా నటిస్తున్న ఈ చిత్రం లో సీనియర్ నటి భూమిక వాంప్ గా నటించ నుంది.ప్రస్తుతం సంగీత దర్శకుడిగా ఫుల్ ఫార్మ్ లో ఉన్న ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చు తున్నాడు. ఇక ఈ చిత్రం లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. వీటిలో ఒకటి రాయలసీమకి చెందిన పాత్ర కాగా, మరొకటి అఘోర పాత్ర. అని తెలిసింది .

ఇకపోతే బాలకృష్ణ నటించే అఘోర పాత్రకి దృశ్య పరంగా డైలాగ్స్ తక్కువగా వుంటాయట .. ఈ విషయం తెలుసుకొన్న బాలకృష్ణ అభిమానులు ఈ పాత్ర విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారట. బోయపాటి సన్నిహితులు కూడా, అఘోర పాత్రను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకంటారోననే సందేహాన్ని వ్యక్తం చేశారట. దాంతో దర్శకుడు బోయపాటి ఆ పాత్ర నిడివిని తగ్గించి, అఘోరగా బాలకృష్ణ తెరపై తక్కువ సేపు కనిపించేలా స్క్రిప్టులో మార్పులు చేసుకుంటున్నాడని సమాచారం. లాక్ డౌన్ కారణం గా షూటింగ్ ఆగి పోవడం ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఇపుడే చేయాలను కొంటున్నాడట, బోయపాటి.