లాక్‌ డౌన్‌ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల!

సంక్షోభ సమయంలో బ్యాంకు సేవలు ప్రశంసనీయమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. దేశంలో లాక్‌ డౌన్‌ అనంతరం రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్‌బీఐ సమీక్ష సమావేశం ముంబైలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం వివరాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఖరీఫ్‌ లో 36 […]

Written By: Neelambaram, Updated On : April 17, 2020 6:33 pm
Follow us on


సంక్షోభ సమయంలో బ్యాంకు సేవలు ప్రశంసనీయమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. దేశంలో లాక్‌ డౌన్‌ అనంతరం రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఆర్‌బీఐ సమీక్ష సమావేశం ముంబైలో శుక్రవారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం వివరాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఖరీఫ్‌ లో 36 % ధాన్యం ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. భారత్‌ జీడీపీ 1.9 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసిందన్నారు. జీ-20 దేశాల్లో భారత్‌ జీడీపీ నే అధికమన్నారు. జీడీపీ లో 3.2 శాతం ద్రవ్యం అందుబాటు లోకి తెచ్చినట్లు తెలిపారు. బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయని, 2021-22 వృద్ధి రేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల వృద్ధి రేట్లు తిరోగమనంలో ఉన్నాయి. మన దేశంలో ఆ పరిస్థితి లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎం లు పని చేస్తున్నాయన్నారు. బ్యాంకులు, ఎటీఎం లలో ఎప్పటి కప్పుడు నగదు నింపుతున్నాయని, బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉందన్నారు.