Rakhi Sawant
Rakhi Sawant: స్టార్ హీరోయిన్ రాఖీ సావంత్ తల్లి అయ్యే ఛాన్స్ కోల్పోయారు. ఈ మేరకు ఆమె చేసిన కామెంట్స్ విషాదకరంగా ఉన్నాయి. ప్రాణాలకు ముప్పు అని సూచించిన డాక్టర్స్ ఆమెకు సర్జరీ చేశారట. దాని కారణం ఆమె ఇకపై తల్లి అయ్యే అవకాశం లేదట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం.. బాలీవుడ్ లో స్టార్ గా వెలుగొందింది రాఖీ సావంత్. ముంబై లో పుట్టిన రాఖీ సావంత్ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. 1997లో విడుదలైన అగ్నిచక్ర చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది.
అనేక చిత్రాల్లో గ్లామరస్ రోల్స్ చేసింది. రాఖీ సావంత్ ఐటెం భామగా అత్యంత పాప్యులర్. పలు హిందీ చిత్రాల్లో ఆమె ఐటెం సాంగ్స్ చేశారు. తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కిన ద్రోణ మూవీలో రాఖీ సావంత్ ఓ సాంగ్ చేయడం విశేషం. ద్రోణ అంతగా అడగకపోవడంతో రాఖీ సావంత్ మరలా తెలుగులో ఐటెం సాంగ్ చేయలేదు.
45 ఏళ్ల రాఖీ సావంత్ ఎప్పుడూ వివాదాల్లో ఉంటుంది. రాఖీ సావంత్ 2019లో రితేష్ సింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు కలిసి కాపురం చేసింది. పెళ్ళైన రెండేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2022లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది ఆదిల్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. అతడు తనకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఆదిల్ ఖాన్ పై రాఖీ సావంత్ కేసు పెట్టడంతో అతడు అరెస్ట్ అయ్యాడు.
ఆదిల్ ఖాన్-రాఖీ సావంత్ వివాదం బాలీవుడ్ లో రచ్చ లేపింది. తాజాగా రాఖీ సావంత్ తన ఆరోగ్యం కి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ… కొద్ది రోజుల క్రితం నేను వైద్య పరీక్షలు చేయించుకున్నాను. డాక్టర్స్ గుండెపోటు లక్షణాలు ఉన్నాయని అన్నారు. నా గర్భాశయంలో పది సెంటీమీటర్ల కణితి ఉందని గుర్తించారు. అది తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నారు. దాంతో సర్జరీ చేయించుకున్నాను. ఇకపై నేను తల్లిని కాలేను. హాస్పిటల్ బిల్ హీరో సల్మాన్ చెల్లించాడని.. చెప్పి ఆమె ఆవేదన చెందారు.
Web Title: Star heroine rakhi sawant lost the chance to become a mother
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com