Bigg Boss 9 Telugu: ఎన్నో భారీ అంచనాల నడుమ నిన్న సాయంత్రం మొదలైన ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) అప్పుడే యాక్షన్ మోడ్ లోకి వచ్చేసింది. నిన్న అక్కినేని నాగార్జున హౌస్ లో ఉండే సినీ సెలబ్రిటీలకు కొన్ని ముఖ్యమైన టాస్కులను ఇప్పించాడు. ఉదాహరణకు ఇమ్మానుయేల్ కి ప్రతీ రోజు ఇల్లు మొత్తం శుభ్రం చేయడం, అదే విధంగా ఫ్లోరా షైనీ చేత ఒక వారం రోజులపాటు బాత్రూం ని క్లీన్ చేసే పని ఇవ్వడం, సంజన గల్రాని కి వారం రోజుల పాటు వంట చేసే బాధ్యతలు ఇవ్వడం, రాము రాథోడ్ తో హౌస్ లో ఉండే ప్రతీ ఒక్కరు బట్టలను ఉతికే కార్యక్రమాన్ని అప్పజెప్పడం, రీతూ చౌదరి కి అంట్లు తోమే పని ని ఇవ్వడం వంటివి చేసాడు. వీటి అన్నిటిని సామాన్యుల చేత ఇప్పించారు. అయితే నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇచ్చిన పనులను మార్చుకునే అవకాశం కల్పించాడు.
నిన్న సెలబ్రిటీలకు టాస్కులు ఇచ్చిన కంటెస్టెంట్స్ నే మిగిలిన వాళ్లకు టాస్కు ఇవ్వాలి. ఈ టాస్క్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఇందులో మాస్క్ మ్యాన్ సంజన గల్రాని ఎలాగో ఖాళీగా ఉంది కదా, ఆమెకు ఎదో ఒక పని అప్పగిస్తే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు మాస్క్ మ్యాన్ హరీష్ . దీనికి మర్యాద మనీష్ ఇది కరెక్ట్ కాదు అని అంటాడు. అప్పుడు మాస్క్ మ్యాన్ సమాధానం చెప్తూ ‘మీకు ఇది అనవసరం మనీష్. మీరు సైలెంట్ గా ఉండండి. నేను చేసేది తప్పు అంటున్నారు కదా, అది నిజమైతే దాని పరిణామాలను ఎదురుకోవడానికి నేను సిద్దమే, ఇంటి నుండి వెళ్లిపొమ్మని చెప్పినా వెళ్ళిపోతాను, మీరు సైలెంట్ గా కూర్చోండి’ అని అంటాడు. వీళ్లిద్దరి వల చూసి గొడవ పెద్దది అవుతుంది అనే విషయాన్నీ పసిగట్టి భరణి ఆపేందుకు ముందుకు వచ్చాడు.
అయితే మాస్క్ మ్యాన్ హరీష్ ప్రతీ దానికి అంత కోపంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఎదో కాస్త డిఫరెంట్ గా ఉండాలి అని బలంగా మైండ్ లో ఫిక్స్ అయ్యి వచ్చినట్టు అనిపిస్తుంది, బిగ్ బాస్ షో కి అది అవసరమే, కానీ హరీష్ ని చూస్తుంటే అతను హద్దులు మొత్తం దాటేసినట్టు గా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే మాస్క్ మ్యాన్ ఇంత హైపర్ అయిపోతున్నాడు. రాబోయే రోజుల్లో హౌస్ లో తారా స్థాయిలో గొడవ పడే టాస్కులు వస్తాయి, అప్పుడు ఏమి చేస్తాడు?, అవసరమైతే కొట్టేస్తాను అని ఆడిషన్స్ లో అన్నట్టుగా, హౌస్ లో కూడా చేసి చూపిస్తాడా అని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో మాస్క్ మ్యాన్ లో ఎన్ని వేరియేషన్స్ బయటకి వస్తాయి అనేది.