Mayank Yadav: ఐపీఎల్ లో లక్నో జట్టు తరఫున మెరుపులు మెరిపించిన సూపర్ ఫాస్ట్ బౌలర్ మాయాంక్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. తాను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయితే పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించాలంటే ఇంకా సమయం పడుతుందని అతడు వివరించాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మయాంక్ యాదవ్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు.. లక్నో జట్టు తరఫున సుడిగాలి బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు. తొలి మ్యాచ్ లోనే తన సత్తా ఏమిటో చాటి చెప్పాడు. వరుసగా రెండు మ్యాచ్ లలో జట్టును విజయపథంలో నడిపించాడు.
మయాంక్ యాదవ్ గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ వేసి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు . రెండుసార్లు వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలను దక్కించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా మాయాక్ యాదవ్ వినతికెక్కాడు. సూపర్ ఫామ్ లో ఉన్నప్పటికీ.. పక్కటెముకలకు గాయాలు కావడంతో.. ఐపీఎల్ లో మిగతా మ్యాచ్ లలో అతడు ఆడలేకపోయాడు. అతడు లేని లోటు లక్నోజట్టు పై తీవ్రంగానే ప్రభావం చూపింది. ఆ గాయం కారణంగా మయాంక్ యాదవ్ కొద్దిరోజులుగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స పొందుతున్నాడు. ” ఇక్కడ నాకు పూర్తిస్థాయిలో ఉపశమనం లభిస్తోంది. నాకు అందిస్తున్న ట్రీట్మెంట్ దాదాపు పూర్తయింది. గాయం నుంచి దాదాపుగా నేను కోలుకున్నాను. పూర్తిస్థాయిలో నేను ఫిట్ నెస్ సాధించాలని అనుకుంటున్నాను. అయితే 100% సాధించాలంటే ఇంకా కాస్త సమయం ఇక్కడే ఉండాలి.. పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తూ నాకు నేను సానుకూలత కలిగించుకుంటున్నాను. నా పురోగతి పట్ల నాకైతే పూర్తి ఆశావాహ దృక్పథం ఉందని”ది టెలిగ్రాఫ్ ఇండియాతో మయాంక్ యాదవ్ అన్నాడు.
మయాంక్ యాదవ్ పై పూర్తిస్థాయిలో సెలెక్టర్లు దృష్టి సారించిన నేపథ్యంలో.. దులీప్ ట్రోఫీ -2024 లో అతడిని ఆడించి.. అందులో చూపించిన ప్రదర్శన ఆధారంగా జాతీయ జట్టులోకి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.”మాయాంక్ యాదవ్ విషయంలో మేము ఎటువంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదు. అతడు ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టు అవసరాల దృష్ట్యా వేరువేరు ఫార్మాట్లలో ఆడిస్తాం. అందులో అతడు నైపుణ్యం సాధించిన తర్వాతే టీమిండియాలో ఎంట్రీ కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. హడావిడిగా అతడిని జాతీయ జట్టులోకి పంపిస్తే ఆశించినంత స్థాయిలో ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉండదని” బీసీసీఐ బాధ్యులు అభిప్రాయపడుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mayank yadav gives big update on his fitness ahead of india squad selection for sri lanka tour
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com