Dharmendra passes away: బాలీవుడ్ దిగ్గజ నటులలో ఒకరిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ధర్మేంద్ర…కొద్దిరోజుల నుంచి శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన గత కొద్దిసేపటికే ముంబైలోని ఒక హాస్పిటల్ లో తన తుది శ్వాసను విడిచినట్టుగా తన సన్నిహితులు ధృవీకరించారు. ఆయన మరణ వార్త బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేస్తోంది… తన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో గొప్ప సినిమాలను చేసి నటుడిగా తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసిన ఆయన ఈరోజు చనిపోవడం అందరిని తీవ్రమైన బాధకి గురి చేస్తోంది.ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక లెజెండరీ నటుడు దూరమైపోయాడనే చెప్పాలి… అమితాబచ్చన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన ‘షోలే’ సినిమాలో ధర్మేంద్ర పోషించిన పాత్ర మనందరికీ చిరస్మరణీయంగా గుర్తుంది పోతుడ్లందనే చెప్పాలి.
ఒకానొక సమయంలో అమితాబ్ సైతం ధర్మేంద్ర లేకపోతే సోల్ లేదు అని చెప్పిన మాటలను ఇప్పుడు అందరూ గుర్తుచేసుకుంటున్నారు… దోస్త్, డ్రీమ్ గర్ల్, అలీబాబా ఔర్ 40 చోర్, గాయల్, సన్నీ, మేర నామ్ జోకర్ లాంటి సినిమాల్లో నటించి ఉత్తమ నటుడిగా గొప్ప గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన నటుడు కూడా తనే కావడం విశేషం…
2012వ సంవత్సరంలో ఇండియాలో అత్యుత్తమ పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నాడు. పంజాబ్ లోని లూథియానా అనే గ్రామంలో జన్మించాడు. ఆయన పూర్తి పేరు ‘ధర్మేంద్ర కేవాల్ క్రిషన్ డియోల్’…ఇక ఆయన తన 19 వ ఏటా ప్రకాష్ కౌర్ ను పెళ్లి చేసుకున్నాడు…ఆ తర్వాత ఇండస్ట్రీ కి వచ్చాడు. ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్ కి వెళ్ళిన తర్వాత హేమమాలిని ని రెండో పెళ్లి చేసుకున్నారు…
ఇక ధర్మేంద్ర మొదటి భార్య కొడుకులు అయిన సన్నీ డియోల్, బాబీ డియోల్ హీరోలుగా మనందరికి సుపరిచితులే… ఇక ధర్మేంద్ర ఇక్కిస్ అనే ఒక సినిమాలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా సరే ఈ సినిమాని చూసి ధర్మేంద్రను చివరిసారిగా స్క్రీన్ మీద చూడాలనే ఒక ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నట్టుగా తెలుస్తోంది…