Maidaan OTT: మన తెలుగు వారి మీద సినిమా కానీ బాలీవుడ్ హీరో.. ఈ చిత్రం విశేషాలివీ

భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా. ఈ సినిమా కథ విషయానికి వస్తే, 1952 ప్రాంతంలో జరిగిన విషయాల గురించి తెలిపారు.

Written By: Swathi, Updated On : May 25, 2024 2:17 pm

Maidaan OTT

Follow us on

Maidaan OTT: చాలా సార్లు ఇతర వ్యక్తుల మీద సినిమాలు వస్తున్నాయి అని.. తెలుగు వారి మీద సినిమాలే రావడం లేదు అని చాలా మంది బాధ పడతారు. కొన్ని సార్లు తెలుగు వారి మీద సినిమాలు వచ్చినా కూడా హిట్ కాకపోవడంతో ఆ సినిమాల గురించి పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు. ఇక తెలుగు వారి మీద సినిమాలు తీయాలి అనుకునేవారు కూడా తక్కువే అనే టాక్ కూడా ఉంది. ఈ విషయంలో బాలీవుడ్ బెటర్ అంటారు కొందరు. ఎంతో మంది నిజ జీవితాల గురించి వారు సినిమాలు తెరకెక్కిస్తుంటారు.

ఇదెలా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ సినిమా సంతోషాన్ని కలిగిస్తుంది. అదేనండి మన హైదరాబాద్ వ్యక్తి మీద సినిమా రూపొందించారు.ఈ సినిమా ఏకంగా ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకుంది.ఇక ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన మైదాన్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి హిట్ ను సొంతం చేసుకుంది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా చేసింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా. ఈ సినిమా కథ విషయానికి వస్తే, 1952 ప్రాంతంలో జరిగిన విషయాల గురించి తెలిపారు. హెల్సింకీ ఒలింపిక్స్‌లో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో భారత జట్టు యుగోస్లేవియా చేతిలో ఓడిపోయింది. దాంతో అసలు జట్టు ఎందుకు ఓడిపోయింది అనే విషయాన్ని కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం ఫెడరేషన్ కి చెప్పాలి అని ప్రయత్నిస్తాడు. ఇందులో కోచ్ పాత్రను అజయ్ దేవగన్ పోషించారు.

జట్టుకి మద్దతుగా నిలబడి వాళ్ళని గెలిపించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ కథ. స్పోర్ట్స్ డ్రామా సినిమాలు రూపొందించడం అంటే చాలా రిస్క్ చేయాల్సిందే. ఒకపక్క స్పోర్ట్స్ ముఖ్యమైన అంశంగా తీస్తూనే, మరొక పక్క మిగిలిన విషయాలు కూడా కవర్ చేస్తుండాలి. అప్పుడే సినిమా అందరినీ ఆకర్షిస్తుంది. దీన్ని సినిమాలో కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు ఇక మైదాన్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డ్స్ సృష్టించకపోయినా కూడా, థియేటర్లో చూసినవాళ్లు నిరాశ పడలేదు.