https://oktelugu.com/

Prashanth Verma : ప్రశాంత్ వర్మ తో సినిమా చేయడానికి సిద్ధం అయిన బాలీవుడ్ స్టార్ హీరో…

ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్ డైరెక్టర్స్ అందరూ తమ దైన రీతిలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్నారు..

Written By:
  • Gopi
  • , Updated On : August 5, 2024 / 10:59 AM IST
    Follow us on

    Prashanth Verma : హనుమాన్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ… ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో కూడా భారీ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం పోటీపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ ఇంతకుముందు రన్వీర్ సింగ్ తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలైతే వినిపించాయి. ఇక దానికి తగ్గట్టుగానే రణ్వీర్ సింగ్ కూడా ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక తర్వాత ఏం అయిందో తెలియదు కానీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఇతర బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ వర్మ తో సినిమాలు చేయడానికి ఆసక్తిగా చూపిస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ‘జై హనుమాన్’ సినిమా అయిపోయే దాకా తను ఏ ప్రాజెక్టును కన్ఫర్మ్ చేయలేని పరిస్థితిలో ఉండడంతో ఈ సినిమా మీద ఆయన ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ అయితే ఇవ్వడం లేదు. కానీ మొత్తానికైతే ఒక బాలీవుడ్ హీరోతో తన సినిమా ఉంటుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇక రన్వీర్ సింగ్ తనకు హ్యాండ్ ఇచ్చాడు. కాబట్టి తన మీద రివెంజ్ తీర్చుకోవడానికైన మరొక బాలీవుడ్ హీరోతో ఒక సినిమా చేసి బ్లాక్ బాస్టర్ కొట్టాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ‘టైగర్ ష్రాఫ్’ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది…

    ఇక ఏది ఏమైనప్పటికి ప్రశాంత్ వర్మ లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండటం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే హనుమాన్ సినిమా 50 కోట్ల బడ్జెట్ తోనే బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావడమే కాకుండా 400 కోట్ల కలెక్షన్స్ ను కూడా రాబట్టేలా చేశాడు. కాబట్టి ఆయన టాలెంట్ ను మనం మెచ్చుకోకుండా ఉండలేము. ఇక ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డిటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు.

    అందువల్లే ఆయన సినిమాలను చూసే ఆడియన్స్ కి ఆ సినిమాలు తొందరగా రీచ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆయన జై హనుమాన్ సినిమాలో హనుమాన్ యొక్క గొప్పతనాన్ని చాలా గ్రాండ్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఎందుకంటే ఆయన చేసే సినిమాల్లో చాలా సినిమాలు మంచి సక్సెస్ లను సాధించాయి. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

    ఇక మొత్తానికైతే ప్రశాంత్ వర్మ తో పని చేయడానికి చాలా మంది స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఆయనకి చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా అడ్వాన్స్ లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది…ఇక ఒక పక్క బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ ని కూడా ప్రశాంత్ వర్మ లాంచ్ చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…