Mirzapur season 3 : బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన మీర్జాపూర్ సిరీస్ కి చాలా గణనీయమైన ఆదరణ దక్కింది. ఇక ఈ సిరీస్ కి చాలామంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో వచ్చిన మొదటి రెండు సీజన్లు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక రీసెంట్ గా సీజన్ 3 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక జూలై 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మీర్జాపూర్ సీజన్ 3 పట్ల కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. ఎందుకంటే మొదటి రెండు సీజన్లు ఉన్నట్టుగా ఈ సిరీస్ లేదని, దీనిని ప్రేక్షకులు అంత బాగా ఎంజాయ్ చేయలేదంటూ చాలా కామెంట్లు అయితే వినిపించాయి. ఇక మొదటి రెండు సీజన్లలో మున్నా భయ్యా ఉండడం వల్ల దానికి మంచి ఆదరణ దక్కిందని ఇక రెండోవ సీజన్ చివరి ఎపిసోడ్ లో మున్నా చనిపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైయ్యారు. ఇక అందులో భాగంగానే సీజన్ 3 మాత్రం మంచి అంచనాలతో వచ్చింది. అయినప్పటికీ సరైన ఆదరణ అయితే దక్కలేదు. ఇక ఇప్పుడు ఇదిలా ఉంటే గుడ్డు భాయ్ క్యారెక్టర్ ని పోషించిన ‘అలీ ఫజల్’ కి సంబంధించిన ఒక చివరి ఎపిసోడ్ ని బ్యాలెన్స్ లో ఉంచారు. ఇక ఇలాంటి క్రమం లోనే అలీ ఫజల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడుతూ ఈ చివరి ఎపిసోడ్ లో మున్నా భయ్యా కూడా ఎంట్రీస్తే ఇవ్వచ్చు అంటూ ఒక హింట్ అయితే ఇచ్చాడు.
ఇక దాంతో మున్నా భయ్యా అభిమానులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికైతే చివరి ఎపిసోడ్లో మున్నా భయ్యా ఎంట్రీ ఉంటుంది అని కొంతమంది అంటుంటే, ఇక మరి కొంతమంది మాత్రం మున్నా భయ్యా ఎంట్రీ ఉంటే అది ఫాల్స్ స్క్రీన్ ప్లే అవుతుంది తప్ప, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవ్వదు. అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మరి మొత్తానికైతే చివరి ఎపిసోడ్ మీదనే ఇప్పుడు మీర్జాపూర్ అభిమానులందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక మిగతా అన్ని ఎపిసోడ్లకు దక్కని క్రేజ్ ఈ ఒక్క ఎపిసోడ్ కి దక్కబోతుందంటూ సినీ మేధావులు సైతం తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే మీర్జాపూర్ సిరీస్ సీజన్ 3 గత రెండు సీజన్లతో పోలిస్తే కొంతవరకు తగ్గింది.ఇక దానికి కారణం ఏంటంటే మున్నా భయ్యా లేకపోవడం ఒకటైతే, ఈ సీజన్ ను అంత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించ లేకపోవడం మరొకెత్తు…
కాబట్టి ఈ చివరి ఎపిసోడ్ తో దీని మీద భారీ హైప్ ని పెంచాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మీర్జాపూర్ సిరీస్ ఇన్స్పిరేషన్ తో చాలా సిరీసులు వచ్చాయి. అందులో కొన్ని క్లిక్ అయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి. ఇక బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన మీర్జాపూర్ సిరీస్ అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఇప్పుడు అలాంటి కంటెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ అప్పట్లోనే ఈ కంటెంట్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం అనేది ఒక మిరాకిల్లా జరిగిపోయింది…