Diabetes Symptoms: ఎన్నో వ్యాధులు ముందుగా లక్షణాలతోనే బయటపడతాయి. ఇక డయాబెటీస్ కూడా అంతే. దీనికి సంబంధించి ఉదయం సమయంలోనే మనం ఎక్కువగా లక్షణాలను గమనించగలం.వీటికి సంబంధించిన లక్షణాలను కనుగొని వెంటనే వైద్యులను సంప్రదిస్తే సమస్యను కాస్త త్వరగా పరిష్కరించవచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటో కూడా ఓ సారి తెలుసుకుందాం.
అధిక దాహం
ఇది ఉదయం వేళల్లో రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ దాహం వేస్తుంది. ఉదయం 4 నుంచి 8గంటల సమయం మధ్యలో అధికంగా దాహం వేస్తుంటుంది. హై బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోకపోవడం వల్ల కూడా గ్లూకోజ్ పెరిగి శరీరంలో ద్రావణాలు ఎక్కువగా అవసరం అవుతాయి. అప్పుడు బాడీ డీహైడ్రేట్ అయి దాహం ఎక్కువగా అనిపిస్తుంది.
నోరు పొడిబారడం:
నిద్ర లేచిన వెంటనే నోరు పొడిబారుతుంది. అంటే షుగర్ లెవల్ ఎక్కువగా ఉండటం వల్లనే ఇది సంభవిస్తుంది. శరీరంలో ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోతే డీహైడ్రేట్ అవుతుంది బాడీ. ధీనివల్లనే నోరు పొడిబారుతుంది.
ఉదయమే నీరసం..
నిద్ర లేవగానే నీరసంగా, మత్తుగా ఉంటుంది. గ్లూకోజ్ లెవల్స్ పడిపోయి శరీరానికి సరిపడా శక్తి ఇవ్వకపోవడం వల్ల ఉదయమే నీరసంగా అనిపిస్తుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లి నిద్ర సరిగా లేకపోతే కూడా ఉదయం నీరసంగా అనిపిస్తుంది.
మూత్రానికి పదేపదే వెళ్లడం
ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం కూడా డయాబెటీస్ కు సూచనే అంటారు నిపుణులు. సాధారణంగా ఇది రాత్రి లేదా ఉదయం వేళల్లో ఎక్కువగా సంభవిస్తుంటుంది..అయితే గ్లూకోజ్ను ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలు మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటాయట..
తలనొప్పి:
డయాబెటిస్ ఉన్నవారికి తరచుగా తలనొప్పి వస్తుంది. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే హైపర్ గ్లైసీమియా, తక్కువగా ఉంటే హైపోగ్లైసేమియా అంటారు నిపుణులు. దీని వల్ల తలనొప్పి ఎక్కువ వస్తుంది.
ఆకలి ఎక్కువ:
ఇన్సులిన్ తగ్గిపోతుంది కాబట్టి శరీరానికి గ్లూకోజ్ సరిగ్గా అందదు. దీని వల్ల ఆకలి ఎక్కువ వేస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు మీలో ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరిస్తే ఎఫెక్ట్ ఎక్కువగా ఉండకపోవచ్చు.