Prabhas: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ సినిమా చేసినా కూడా అక్కడి ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తమ పాగ వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే కొంతమంది హీరోలు అక్కడ సక్సెస్ ని కూడా సాధించారు.
ఇక మరి కొంతమంది తెలుగు హీరోలు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్నారు. ఇక ఇట్లాంటి క్రమంలోనే ఇప్పటికే పాన్ ఇండియాలో వరుస సినిమాలను రిలీజ్ చేసిన ప్రభాస్ అక్కడ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు. అయితే ఇండియా మొత్తం లో ఇప్పుడు ప్రభాస్ హవానే నడుస్తుందని అందరూ అనుకుంటున్నా సందర్భంలో అక్కడి స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ మాత్రం ప్రభాస్ మాకు పోటీ కానే కాదు అంటూ కొన్ని వ్యాఖ్యలైతే చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మాకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసు మాకు ఎవరితో పోటీ లేదు.కాకపోతే ఇక్కడి ప్రేక్షకుల అభిరుచులు మారాయి.
ఇక ప్రస్తుతం వాటికి అనుగుణంగా మేము సినిమాలను చేయలేకపోతున్నాం. కానీ ఎప్పటికీ చేయలేము అని మేము అనుకోవడం లేదు. తొందర్లోనే బాలీవుడ్ హీరోలందరూ కూడా మంచి ఫామ్ లోకి వస్తారు అంటూ అమీర్ ఖాన్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక ప్రభాస్ ఇమేజ్ చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కుళ్ళుకుంటున్నప్పటికీ వాళ్ల క్రేజ్ ఎక్కడ తగ్గిపోతుందో అనే ఉద్దేశ్యంతోనే ప్రభాస్ ని పొగడడానికి వాళ్లకి ఇగో అయితే అడ్డుపడుతుంది.
అందువల్లే మేము ఎవరి కంటే తక్కువ కాదు, మాకు ఎవరు పోటీ కాదు అనే రేంజ్ లో వాళ్ల వైఖరిని చూపిస్తూనే అవసరమైన సమయంలో ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు…ఇక మొత్తానికైతే బాలీవుడ్ హీరోలు వాళ్ల భయాన్ని బయట పెట్టకుండా దాచుకు తిరుగుతున్నారు…