https://oktelugu.com/

Salman Khan: ఫాంహౌస్ లో స్టార్ హీరోను కుట్టిన పాము.. ఆస్పత్రికి తరలింపు.. హెల్త్ అప్డేట్ ఇదే

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్ లో ఆయన ఫామ్ హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి సల్మాన్ పాముకాటుకు గురికాగా… వెంటనే హాస్పిటల్ కు తరలించారని అంటున్నారు. అయితే సల్మాన్ ను విషం లేని పాము కాటేయడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఎంజిఎమ్ హాస్పిటల్ లో సల్మాన్ ను జాయిన్ చేశారు. అయితే  పాము కాటు వేసిన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 26, 2021 / 02:48 PM IST
    Follow us on

    Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాముకాటుకు గురయ్యారు. మహారాష్ట్రలోని పన్వేల్ లో ఆయన ఫామ్ హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి సల్మాన్ పాముకాటుకు గురికాగా… వెంటనే హాస్పిటల్ కు తరలించారని అంటున్నారు. అయితే సల్మాన్ ను విషం లేని పాము కాటేయడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని ఎంజిఎమ్ హాస్పిటల్ లో సల్మాన్ ను జాయిన్ చేశారు.

    అయితే  పాము కాటు వేసిన తర్వాత.. సల్మాన్ ఖాన్ ను నేరుగా నవీ ముంబై కమోతే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు ఆయన అనుచరులు ట్రీట్మెంట్ అనంతరం ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు సల్మాన్ ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని వైద్యులు వెల్లడించారు. ఇక ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

    కాగా రేపు సల్మాన్ ఖాన్ 56వ పుట్టినరోజు జరుపుకోనుండగా ఇలాంటి సమయంలో పాముకాటుకు గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సల్మాన్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఫామ్ హౌస్ కి సల్మాన్ వెళ్లారు. ప్రమాదం తప్పింది కాబట్టి సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను సింపుల్ గా ఫామ్ హౌస్ లోనే తన ఫ్యామిలీతో జరుపుకోనున్నారు.