https://oktelugu.com/

Sukumar: నిర్మాతలు చెప్పేది వినడు, హీరో చెప్పేది విన్నట్టు నటిస్తాడు.

Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ అంటూ సుకుమార్ కి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ పేరును ఆయన ఓన్ చేసుకున్నాడు. ఎప్పుడైతే తానూ క్రియేటివ్ డైరెక్టర్ ను అని సుక్కు ఫీల్ అయ్యాడో ఇక అప్పటి నుంచి సుకుమార్ పైత్యం తారాస్థాయికి పోయిందని టాక్ ఉంది. నిర్మాతలు చెప్పేది వినడు, హీరో చెప్పేది విన్నట్టు నటిస్తాడు. చివరకు తన పైత్యంతో ఏమి చేస్తాడో అదే సినిమా అవుతుంది. నిజానికి సుకుమార్ తన కెరీర్ మొదట్లో పోష్ అర్బన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 26, 2021 / 02:58 PM IST
    Follow us on

    Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ అంటూ సుకుమార్ కి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ పేరును ఆయన ఓన్ చేసుకున్నాడు. ఎప్పుడైతే తానూ క్రియేటివ్ డైరెక్టర్ ను అని సుక్కు ఫీల్ అయ్యాడో ఇక అప్పటి నుంచి సుకుమార్ పైత్యం తారాస్థాయికి పోయిందని టాక్ ఉంది. నిర్మాతలు చెప్పేది వినడు, హీరో చెప్పేది విన్నట్టు నటిస్తాడు. చివరకు తన పైత్యంతో ఏమి చేస్తాడో అదే సినిమా అవుతుంది.

    Sukumar

    నిజానికి సుకుమార్ తన కెరీర్ మొదట్లో పోష్ అర్బన్ కథలతో ఎక్కువగా సినిమాలు తీస్తూ వచ్చాడు. అయితే, ఓ నవలా రచయిత ఓ సందర్భంలో ‘రంగస్థలం’ సినిమా తాలూకు పాయింట్ చెప్పాడట. ఆ తర్వాత ఆయన తన కథల పంథాని మార్చుకున్నాడు. రామ్ చరణ్ వంటి హీరోని “రా”గా చూపించి మొత్తానికి భారీ హిట్ కొట్టాడు.

    అప్పటికీ ఆ నేపథ్యంలో సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయింది. పైగా ఆ సినిమా విషయంలో అన్నీ కలిసి వచ్చాయి. బడ్జెట్ తో సహా. అందుకే, సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఐతే, అదంతా తన క్రియేటివిటీ అని సుకుమార్ బలంగా నమ్మడం మొదలుపెట్టాడు. తన డైరెక్షన్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడని ఎవరో బిస్కెట్ రాయుళ్లు అన్నారట.

    Also Read: ఫాంహౌస్ లో స్టార్ హీరోను కుట్టిన పాము.. ఆస్పత్రికి తరలింపు.. హెల్త్ అప్డేట్ ఇదే

    ఇక ఆ ఉత్సాహంతో సుకుమార్ “పుష్ప” సినిమాని తెర పైకి తీసుకొచ్చాడు. ఎక్కువ బడ్జెట్ పెట్టి మరీ. నేడు కమర్షియల్ గా పుష్పకి కష్టాలు వచ్చాయి అంటే కారణం.. సుకుమారే. కాకపోతే, హీరోని మరింత నాటుగా మలిచి బాగా చూపించాడు. ఒకప్పుడు తమిళ దర్శకుడు బాలా తన ‘శివపుత్రుడు’ సినిమాలో హీరోని ఎలా అయితే చూపించాడో, అచ్చం ఆలాగే హీరో అల్లు అర్జున్ పాత్రని చాలా నాటుగా డిజైన్ చేశాడు. అయితే, ఇక్కడ అల్లు అర్జున్ ను మెచ్చుకోవాలి.

    చాలా గొప్పగా నటించాడు బన్నీ. కచ్చితంగా నేటి తరానికి బన్నీ ఆదర్శమే. మరి పుష్ప రెండో భాగం ఎలా ఉంటుందో చూడాలి. సుకుమార్ అయితే, సెకండ్ పార్ట్ ఇంకా బాగా రియలిస్టిక్ గా ఉంటుందని బలంగా చెప్తున్నాడు. కాబట్టి.. ‘పుష్ప’ రెండో భాగంలో అల్లు అర్జున్ ఇంకా నాటుగా కనిపిస్తాడేమో. మరోపక్క ఫహద్ ఫాజిల్ నటన కూడా రెండో పార్ట్ లో హైలైట్ కానుంది.

    Also Read: టికెట్ల ఇష్యూపై మరో బాణాన్ని ఎక్కుపెట్టిన నాని?

    Tags