https://oktelugu.com/

Movie Ticket Controversy : వకీల్ సాబ్ అప్పుడే రియాక్ట్ కావాల్సిందన్న నాని

Movie Ticket Controversy :  ఏపీలో కొద్దిరోజులుగా సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వివాదం నడుస్తోంది. ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల సమయంలో మొదలైన ఈ ఇష్యూ క్రమంగా అగ్ని అజ్యం పోసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీని చుట్టేసింది. దీంతో నాడు నోరుమెదపని హీరోలు, నిర్మాతలు తమ సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యే నాటికి తత్వం బోధపడుతోంది. తాజాగా హీరో నాని బరెస్ట్ అయ్యాడు. తన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల సందర్భంగా ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2021 / 02:48 PM IST
    Follow us on

    Movie Ticket Controversy :  ఏపీలో కొద్దిరోజులుగా సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు వివాదం నడుస్తోంది. ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల సమయంలో మొదలైన ఈ ఇష్యూ క్రమంగా అగ్ని అజ్యం పోసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీని చుట్టేసింది. దీంతో నాడు నోరుమెదపని హీరోలు, నిర్మాతలు తమ సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యే నాటికి తత్వం బోధపడుతోంది. తాజాగా హీరో నాని బరెస్ట్ అయ్యాడు. తన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ విడుదల సందర్భంగా ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల పడుతున్న ఇబ్బందులను ఆయన లేవనెత్తారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే  వకీల్ షాబ్ సినిమాకి అడ్డంకులు పెట్టినప్పుడే మేము అందరం రియాక్ట్ అవ్వాల్సింది అప్పుడు అయ్యుంటే ఇప్పుడు ఇలా అయ్యేది కాదని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాలో యూనిటీ లేక పోవడం వల్ల ఇప్పుడు ఇదంతా జరిగిందని సినీ ఇండస్ట్రీపైన కూడా హీరో నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవిప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

    Movie Ticket Controversy

    పవన్ కల్యాణ్ ను ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే జగన్ సర్కార్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందనే టాక్ విన్పిస్తోంది. ‘వకీల్ సాబ్’ రిలీజు సమయంలో జగన్ సర్కార్ వర్సెస్ పవన్ కల్యాణ్ అన్నట్లుగా వివాదం మొదలైంది. ఆ తర్వాత ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం తన అధికార బలాన్ని ప్రయోగిస్తోంది.

    Also Read: సినిమా టికెట్ రేటు విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తా: నిర్మాత నట్టి కుమార్

    దశాబ్దం కిందట ఉన్న సినిమా టికెట్ల ధరల యాక్ట్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఆన్ లైన్ టికెటింగ్ విధానం ప్రవేశపెడుతామని చెప్పి కొన్ని నెలలు గడుస్తున్నా సర్కార్ నేటికి పోర్టల్ ను సైతం రెడీ చేయలేకపోయింది. మరోవైపు టికెట్ల ధరలను భారీగా తగ్గించడంతో ఈ ధరలతో థియేటర్ల నిర్వహణ కష్టమని యజమానులు వాపోతున్నారు. ఈ ఇష్యూను సీనిపెద్దలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

    జగన్ సర్కార్ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుండటంతో పెద్ద హీరోలంతా సైలంటయ్యారు. అయితే ఈ ఇష్యూపై సిద్దార్థ, నాని లాంటి మీడియం రేంజ్ హీరోలు మాత్రం మాట్లాడుతున్నారు. నాని తన సినిమా ‘శ్యాం సింగ రాయ్’ రిలీజు ఉండగానే ఏపీలోని టికెట్ల రేట్లపై తన బాధను వెళ్లగక్కాడు. సినిమా థియేటర్ల కౌంటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టు కౌంటర్ మెరుగ్గా ఉందని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

    నాని వ్యాఖ్యలపై మంత్రి బోత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ నేతలు విరుచుకపడ్డారు. దీంతో అతడి సినిమాకు ఏపీలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ నాని ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా మూవీ టికెట్ల గొడవకు అసలు మూలం ఎక్కడుందనే విషయమై నాని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

    Also Read: వకీల్ సాబ్ అప్పుడే రియాక్ట్ కావాల్సిందన్న నాని

    ఈ సమస్య ‘వకీల్ సాబ్’ సినిమాతో మొదలైందని నాని స్పష్టం చేశాడు. అప్పుడే ఇండస్ట్రీలో వారంతా స్పందించి ఉంటే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదని నాని చెప్పడం గమనార్హం. జగన్ సర్కారును ఎదుర్కొనేందుకు బడా హీరోలు, నిర్మాతలంతా భయపడి పోతుంటే హీరో నాని మాత్రం ఈ ఇష్యూపై ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దీంతో నాని వెనుక ఎవరైనా ఉన్నారా? చర్చ ఏపీలో జోరుగా నడుస్తోంది.

    హీరో నాని మాట్లాడిన వీడియో