Heroine : సినిమా ఇండస్ట్రీ లోకి ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇలా చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. ఈమె సినిమా కోసం ఎంతటి త్యాగానికైనా సరే రెడీగా ఉంటుంది. తన హావభావాలతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈమె సినిమా వస్తుందంటే చాలు ముఖ్యంగా మగవారు పరిగెత్తుకుంటూ వెళ్లి సినిమా చూస్తారు. సినిమా కోసం ఏం చేయడానికి అయినా రెడీగా ఉండే ఈ హీరోయిన్ ఒక సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువును పెరిగింది అలాగే స్మోకింగ్ కూడా బానిస అయ్యింది. ఈమె తన కెరియర్ స్టార్ట్ అయిన సమయం నుంచే భిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ వస్తుంది. ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఈ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్. వయసుతో సంబంధం లేకుండా విద్యాబాలన్ చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈమె ముంబైలోనీ ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పుడే నటి అవ్వాలి అనుకున్న విద్యాబాలన్ 16 ఏళ్ల చిన్న వయసులో ఏక్తాకపూర్ షో హమ్ పాంచ్ లో రాధికగా తన కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యాబాలన్ పరినీతి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో విద్యాబాలన్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ సినిమా తర్వాత అవకాశాలు రాక చాలా కష్టాలు పడినట్లు విద్యాబాలన్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన డర్టీ పిక్చర్ విద్యాబాలన్ సినిమా కెరియర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పడంలో సందేహం లేదు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు.
ఈ సినిమాకు గాను విద్యాబాలన్ జాతీయ అవార్డును కూడా అందుకుంది. అయితే ఈ సినిమా కోసం విద్యాబాలన్ చేసిన త్యాగం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఇక ఈ సినిమా కోసం విద్యాబాలన్ 12 కిలోల బరువును పెరిగిందట. ఇక బరువును పెరగడానికి ఆమె ప్రతిరోజు ఫ్యాట్ ఉన్నఆహారాన్ని తీసుకునేదట. ఇక ఆ పాత్ర కోసం స్మోక్ కూడా చేయాల్సి వచ్చిందట. ఊరికే ఆ పాత్ర కోసం స్మోక్ చేసినట్లు నటిస్తే బాగుండదని సిగరెట్ తాగడం అలవాటు చేసుకుందట విద్యాబాలన్. అలా ఆ సినిమా కోసం విద్యాబాలన్ సిగరెట్ కి కూడా బానిస అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఆ సిగరెట్ కు ఎంతగా ఎడిట్ అయిపోయాను అంటే రోజుకు రెండు లేదా మూడు తాగితే గాని మనసు కుదుటపడేది కాదని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు. ఆ వ్యసనం నుంచి బయటకు రావడానికి కూడా విద్యాబాలన్ చాలా కష్టపడినట్లు తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టాలీవుడ్ లో విద్యాబాలన్ నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తూ నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది. ఈ సినిమాలో విద్యాబాలన్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇష్కియా, ది డర్టీ పిక్చర్, కహాని వంటి పలు సినిమాలలో నటించి తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ప్రముఖ నిర్మాత సిద్ధార్థ రాయి కపూర్ ను విద్యాబాలన్ పెళ్లి చేసుకుంది. సినిమాలలో పాత్ర డిమాండ్ చేస్తే ఈమె ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటుంది. ఈమె నటనకు కేంద్రం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. రీసెంట్ గా విద్యాబాలన్ భూల్ భూల్లయ్య 3 లో నటించడం జరిగింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక విద్యాబాలన్ ప్రతి సినిమాకు రెండు నుంచి మూడు కోట్లు పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం.