Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ గ్రాఫికల్ చిత్రం ‘విశ్వంభర’ పై అభిమానుల్లో ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత చిరంజీవి నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టు అప్డేట్ అయ్యి భారీ హంగులతో సినిమా చేస్తుండడం వల్ల అంచనాలు వేరే లెవెల్ లో ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ విడుదలైందో అప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు తగ్గిపోయాయి. కారణం నాసిరకమైన గ్రాఫిక్స్ ఉండడం వల్లే . ఈ గ్రాఫిక్స్ ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి వరకు ఆ నెగటివ్ రెస్పాన్స్ వెళ్ళింది. దీంతో అప్పటి నుండి గ్రాఫిక్స్ పై రీ వర్క్ చేయడం మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ చిత్రం జనవరి 10 న విడుదల కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కోసం మెగాస్టార్ వదిలేసుకోవాల్సి వచ్చింది.
సమయం బాగా దొరకడం తో గ్రాఫిక్స్ పై గట్టిగా పనిచేయాలని డైరెక్టర్ వశిష్ఠ కి చిరంజీవి ఆదేశాలు జారీ చేశాడట. వశిష్ఠ కూడా మెగాస్టార్ మాటలను సీరియస్ గా తీసుకొని చాలా బలంగా వర్క్ చేయించాడట. రీసెంట్ గానే కొన్ని షాట్స్ చూపించాడట కూడా. మెగాస్టార్ ఆ షాట్స్ ని చూసి డైరెక్టర్ వశిష్ఠ పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు ఉన్నట్టుగానే గ్రాఫిక్స్ ఉన్నాయి, కొత్తగా చేసింది ఏముంది?, సమయం మొత్తం వృధా చేస్తున్నారు అంటూ మండిపడ్డాడట చిరంజీవి. వెంటనే గ్రాఫిక్స్ టీం ని మార్చేయాల్సిందిగా చెప్పాడట. నిర్మాత అశ్వినీ దత్ సహాయంతో కల్కి చిత్రానికి ఏ గ్రాఫిక్స్ కంపెనీ అయితే పని చేసిందో, ఆ గ్రాఫిక్స్ కంపెనీ కి ఇప్పుడు ‘విశ్వంభర’ చిత్రాన్ని పంపారట. కల్కి చిత్రం లో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఒక కొత్త ప్రపంచం లోకి అడుగుపెట్టినట్టు ఉంటుంది. డిసెంబర్ నెలలోనే మూవీ సంబంధించిన గ్రాఫిక్స్ షాట్స్ మొత్తాన్ని ఆ టీమ్ కి పంపారట. ఇప్పుడు బెస్ట్ ఔట్పుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అభిమానులు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యాయట. కేవలం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆ సన్నివేశాలను కూడా ఈ నెలలో పూర్తి చేసి, సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జూన్ లేదా జులై నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్ గా నటించగా, కన్నడ హీరోయిన్ ఆషిక రంగనాథ్, కుర్ర హీరోయిన్ సురభి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టోరీ పరంగా, టేకింగ్ పరంగా ఈ సినిమా ఇప్పటి వరకు అద్భుతంగా వచ్చిందట. కేవలం గ్రాఫిక్స్ వర్క్ ఒక్కటి సెట్ అయితే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో కుమ్మేస్తుందని మేకర్స్ బలమైన నమ్మకం తో ఉన్నారు.