Heroine : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. అయితే వాళ్లకు మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ లక్ కూడా కలిసి రావాలి. ఒక్కోసారి చేసిన మొదటి సినిమాతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ ఆ తర్వాత అదృష్టం కలిసి రాక కనుమరుగై పోతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె ఉద్యోగం వదిలేసి మరి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి కానీ అనుకున్నట్టు ఆఫర్లు మాత్రం రాలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. అయితే ఈమె చేతిలో సినిమాలు లేక ఏ పాత్ర అయినా చేయటానికి సిద్ధంగా ఉంది. ఈమె మరెవరో కాదు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియాంక జవాల్కర్. మొదటి సినిమాతోనే తన అందంతో, నటనతో అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటే వినదుగా అంటూ ప్రియాంక కుర్రాళ్లను బుట్టలో వేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో సినిమాలు లేక క్యామియో రూల్స్ కూడా చేయడానికి రెడీగా ఉంది. ప్రియాంక 1992, నవంబర్ 12న ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో మరాఠీ కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్ లోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో తన చదువును పూర్తి చేసింది. ఆ తర్వాత అమెరికాలోని ఒక MNC కంపెనీలో కూడా పనిచేసింది.
ఆ తర్వాత ఉద్యోగం మానేసి మరి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కలవరమాయే అనే సినిమాతో ప్రియాంక జవాల్కర్ మొదటిసారి సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరో విజయ్ దేవరకొండకు జోడిగా టాక్సీవాలా సినిమా లో నటించి తెలుగు తెరకు పరిచయమైంది. టాక్సీవాలా సినిమాతో ప్రియాంకకు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు ఇండస్ట్రీలో తన పేరు నిలబెట్టుకోవడానికి బాగా కష్టపడుతుందని తెలుస్తుంది. తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవడం అరుదుగా జరుగుతున్నప్పటికీ ప్రియాంక తన ప్రయత్నం తాను చేస్తుంది. కలవరమాయే సినిమాతో ఈమెకు అంతగా గుర్తింపు రానప్పటికీ. టాక్సీవాలా సినిమా లో తన అందంతో ప్రియాంక అందరిని ఆకట్టుకుంది. టాక్సీవాలా విజయం తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ప్రియాంక.
సత్యదేవ్ తో తిమ్మరుసు, గమనం వంటి సినిమాలలో కూడా నటించింది. అయితే ఇవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని తెలుస్తుంది. ఆ తర్వాత ఈమెకు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఈమె సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించింది. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాలో ఒక క్యామియో రోల్ లో నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మడు. ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.